సౌత్‌జోన్‌ జట్టులో ప్రణవి | Pranavi in ​​the South Zone team | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ జట్టులో ప్రణవి

Mar 13 2026 1:37 AM | Updated on Mar 13 2026 1:37 AM

Pranavi in ​​the South Zone team

సాక్షి, హైదరాబాద్‌: బీసీసీఐ సీనియర్‌ మహిళల ఇంటర్‌ జోనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే సౌత్‌జోన్‌ జట్టును బుధవారం ప్రకటించారు. 15 మంది సభ్యులతోకూడిన సౌత్‌జోన్‌ జట్టులో తెలుగమ్మాయి ప్రణవి చంద్రకు చోటు లభించింది. గతంలో హైదరాబాద్‌కు ఆడిన ప్రణవి ప్రస్తుతం కేరళకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 

మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 3 వరకు పుదుచ్చేరిలో ఈ టోర్నీని నిర్వహిస్తారు. సౌత్‌జోన్‌ జట్టుకు నిక్కీ ప్రసాద్‌ (కర్ణాటక) కెప్టెన్‌గా, మమత (హైదరాబాద్‌) వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. వంకా పూజ (హైదరాబాద్‌), షబ్నమ్, హెన్రిటా పెరీరా (ఆంధ్ర) కూడా సౌత్‌జోన్‌ జట్టులోకి ఎంపికయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement