
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఘోరంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. ఇప్పుడు మాంచెస్టర్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. మాంచెస్టర్ వేదికగా బుధవారం ఇంగ్లీష్ జట్టుతో ప్రారంభమైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గిల్ తీవ్ర నిరాశపరిచాడు.
రెండో సెషన్ యశస్వి జైశ్వాల్ ఔటయ్యాక గిల్ బ్యాటింగ్‌కు దిగాడు. ఈ క్రమంలో గిల్ మైదానంలో అడుగుపెట్టగానే ఇంగ్లండ్ అభిమానులు గట్టిగా అరుస్తూ గేలి చేశారు.లార్డ్స్ టెస్టులో గిల్ వ్యవహరించిన తీరు కారణంగా ఇంగ్లీష్ జట్టు అభిమానులు ఇలా చేశారు.
అయితే ఈ మ్యాచ్‌లో గిల్ ఔటైన తీరుపై నెటిజన్లు ఫైరవతున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ట్రాప్‌లో గిల్ చిక్కుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 50వ ఓవర్ వేసిన స్టోక్స్.. తొలి బంతిని గిల్‌కు అద్బుతమైన ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో గిల్ విఫలమయ్యాడు.
ఆ ఇన్‌స్వింగర్ బంతిని గిల్ ఆడకుండా వదిలేశాడు. కానీ బంతి అద్భుతంగా టర్న్అయ్యి గిల్ ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. వెంటనే అంపైర్ రాడ్ టక్కర్ ఔట్ అంటూ వేలు పైకెత్తాడు.
దీంతో గిల్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న సాయిసుదర్శన్‌తో మాట్లాడి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి ఆఫ్‌స్టంప్‌కు తాకినట్లు తేలింది. దీంతో 12 పరుగులు చేసిన గిల్ మైదానాన్ని వీడక తప్పలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ బర్మి ఆర్మీ గిల్‌ను ట్రోలు చేసింది.
"గిల్ సమయాన్ని తన వృధా చేయకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడని" ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు
Captain 🆚 captain
And Ben Stokes comes out on top! 🔥
🇮🇳 1️⃣4️⃣0️⃣-3️⃣ pic.twitter.com/kjpBIGpp5K— England Cricket (@englandcricket) July 23, 2025