
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను దురదృష్టం వెంటాడింది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో పంత్‌కు తీవ్రగాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో పంత్ కుడికాలికి గాయమైంది.
దీంతో 37 పరుగులు చేసిన రిషబ్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. పంత్ గాయపడక ముందు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశీ గడ్డపై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి పర్యాటక జట్టు వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు.
148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును పంత్ తన పేరిట లిఖించుకున్నాడు. పంత్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో టెస్టుల్లో 1004 పరుగులు చేశాడు. ప్రస్తుతం పంత్ దారిదాపుల్లో ఎవరూ లేరు.
ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్‌లు వీరే..
1004 పరుగులు-రిషబ్ పంత్ (భారత్)*
778 పరుగులు- ఎంఎస్ ధోని (భారత్)
773 పరుగులు - రాడ్ మార్ష్ (ఆస్ట్రేలియా)
684 పరుగులు - జాన్ వైట్ (దక్షిణాఫ్రికా)
624 పరుగులు - ఇయాన్ హీలీ (ఆస్ట్రేలియా)
విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్‌లు వీరే..
1000 – రిషబ్ పంత్ (ఇంగ్లాండ్)
879 – రిషబ్ పంత్ (ఆస్ట్రేలియా)
778 – ఎంఎస్ ధోని (ఇంగ్లాండ్)
773 – రాడ్ మార్ష్ (ఇంగ్లాండ్)
717 – ఆండీ ఫ్లవర్ (భారతదేశం)
👉ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన పర్యాటక వికెట్ కీపర్‌గా పంత్(879) కొనసాగుతున్నాడు.
కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు. భారత బ్యాటర్లలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(58), సాయిసుదర్శన్(61), కేఎల్ రాహుల్(46) రాణించారు.
చదవండి: IND vs ENG: గిల్ నీకు కొంచమైన తెలివి ఉందా.. ఇంత చెత్తగా ఔట్ అవుతావా? వీడియో