
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రా ముగించడంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ది కీలక పాత్ర. ఈ మ్యాచ్‌లో సుందర్ తన విరోచిత పోరాటంతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఈ తమిళనాడు ఆటగాడు మొత్తంగా 206 బంతులు ఎదుర్కొని 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సుందర్‌పై అందరూ ప్రంశసల వర్షం కురిపిస్తుంటే.. అతడి తండ్రి మణి సుందర్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడు నిలకడగా రాణిస్తున్నప్పటికి, జాతీయ జట్టులో ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని భారత సెలక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు
"వాషింగ్టన్ తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిస్తున్నాడు. గత కొంతకాలంగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. కానీ వాషీకి పెద్దగా గుర్తింపు లభించలేదు. భారత జట్టు అభిమానులు సైతం సుందర్ ప్రదర్శనలను గుర్తించడం లేదు. మిగితా ఆటగాళ్లు బాగా ఆడకపోయినా, వారికి క్రమం తప్పకుండా అవకాశాలు లభిస్తున్నాయి.
నా కొడుకు మాత్రం బాగా ఆడిన కూడా రెగ్యూలర్‌గా ఛాన్స్‌లు లభించలేదు. నాలుగో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చినట్లగానే మిగితా మ్యాచ్‌లలో కూడా అదే పొజిషన్‌లో అతడిని పంపాలి. వరుసగా 10 మ్యాచ్‌లలో నా కుమారుడిని ఆడించాలి.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో వాషీకి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. సెలక్టర్లు అతడి ప్రదర్శలనపై ఓ కన్నేసి ఉంచాలి" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంమ్ సుందర్ పేర్కొన్నాడు.
2021లో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సుందర్.. ఇప్పటివరకు కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 12 మ్యాచ్‌లలో 44.87 సగటుతో 673 పరుగులు చేసిన వాషీ.. 32 వికెట్లు కూగా పడగొట్టాడు.
చదవండి: ‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా’