
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.
ఈ సమయంలో జట్టును కెప్టెన్ శుబ్‌మన్ గిల్(167 బంతుల్లో 78 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడపించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం గిల్ సేన 137 పరుగులు వెనుకంజలో ఉంది.
టీమిండియా సవాల్ విసురుతుందా?
కాగా మాంచెస్టర్ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలూండడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందా? లేదా డ్రా ముగిస్తుందా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆఖరి రోజు ఆటలో తొలి సెషన్ టీమిండియాకు చాలా కీలకం కానుంది.
ఇంగ్లండ్‌కు టార్గెట్ నిర్దేశించాలని భారత జట్టు భావిస్తే కచ్చితంగా మొదటి సెషన్‌లో వికెట్లు ఏమీ కోల్పోకుండా కాస్త దూకుడుగా ఆడాలి. ఇంగ్లండ్‌కు 200 పైగా టార్గెట్ ఇవ్వాలన్న టీమిండియా ఖచ్చితంగా టీ బ్రేక్ వరకు అయినా బ్యాటింగ్ చేయాలి. అంటే వన్డే తరహాలో తమ బ్యాటింగ్‌ను కొనసాగించాలి.
ఒకవేళ తొలి సెషన్‌లో టీమిండియా వికెట్లు కోల్పోతే డ్రా కోసం వెళ్తే బెటర్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గాయపడిన రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చినా, క్రీజులో నిలదొక్కకుంటాడో లేదా అన్నది ప్రశ్నార్ధంగా మారింది.
అతడు కాలి పాదం గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. పంత్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లకు వెళ్లే అవకాశముంది. ఆ ప్రయత్నంతో పంత్ వికెట్ కోల్పోయిన ఆశ్చర్యపోన్కర్లలేదు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ప్రతిఘటించే అవకాశమున్నప్పటికి, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్ ఎప్పుడూ ఎలా ఆడుతారో చెప్పలేం.
కాబట్టి టీమిండియా మొత్తం ఆశలన్నీ క్రీజులో ఉన్న శుబ్‌మన్ గిల్, రాహుల్‌పైనే ఉన్నాయి. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ వీలైనంత త్వరగా భారత్‌ను ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.
చదవండి: కివీస్‌దే ముక్కోణపు టోర్నీ