
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో ఇవాళ (జులై 23) మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా మూడు మార్పులు చేసింది. కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ స్థానాల్లో సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ మ్యాచ్‌తో 24 హర్యానా యువ పేసర్ అన్షుల్ కంబోజ్ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల కిందటే తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్ ఆడిన జట్టు నుంచి గాయపడిన షోయబ్ బషీర్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో లియామ్ డాసన్ తుది జట్టులోకి వచ్చాడు.
ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి, మూడో టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది.
తుది జట్లు..
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.
భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.