ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ ఫైన‌ల్‌.. ఎవ‌రు గెలిచినా చ‌రిత్రే | Australian Open 2026 Mens Final, Novak Djokovic vs Carlos Alcaraz Set For Historic Showdown, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ ఫైన‌ల్‌.. ఎవ‌రు గెలిచినా చ‌రిత్రే

Feb 1 2026 10:23 AM | Updated on Feb 1 2026 11:29 AM

Novak Djokovic Vs Carlos Alcaraz Australian Open Final

ఆస్ట్రేలియా ఓపెన్‌-2026లో ర‌స‌వ‌త్త‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. ఆదివారం మెల్‌బోర్న్‌లోని రాడ్ లేవర్ ఎరీనాలో జ‌ర‌గ‌నున్న మెన్స్ సింగిల్స్ ఫైన‌ల్‌లో సెర్బియా స్టార్‌ నొవాక్ జొకోవిచ్, టాప్‌సీడ్‌ కార్లోస్ అల్కరాజ్ అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ మ్యాచ్‌లో ఎవ‌రు గెలిచినా చ‌రిత్రే అవుతుంది. ఈ తుది పోరులో జొకోవిచ్ గెలిస్తే తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధిస్తాడు.

త‌ద్వారా జోకోవిచ్‌ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్)ను అధిగ‌మిస్తాడు. అదేవిధంగా అత‌డికి ఇది 11వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ అవుతుంది. మ‌రోవైపు  22 ఏళ్ల అల్కరాజ్ ఈ టైటిల్‌ను కైవ‌సం చేసుకుంటే, టెన్నిస్ చరిత్రలో నాలుగు వేర్వేరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు.

ఇప్ప‌టివ‌ర‌కు వీరిద్ద‌రూ  9 సార్లు తలపడగా, జొకోవిచ్ 5-4తో స్వల్ప ఆధిక్యంలో ఉన్నాడు. అయితే గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌లో అల్కరాజ్ 2-0తో (రెండు సార్లు వింబుల్డన్‌లో) జొకోవిచ్‌పై పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్ భార‌త కాల‌మానం ప్ర‌కారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement