breaking news
Anshul Kamboj
-
అతడు అరంగేట్రంలోనే 10 వికెట్లు తీస్తాడనుకున్నారా?: కపిల్ దేవ్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ గాయాల బారిన పడటంతో అనూహ్యంగా భారత టెస్టు జట్టులోకి వచ్చిన కాంబోజ్.. తన తొలి మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచాడు.18 ఓవర్లు వేసిన కాంబోజ్ 89 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. తక్కువ స్పీడ్‌తో బంతులు వేయడం, సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయకపోవడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు అతడిని ఓ ఆట ఆడేసికున్నారు.దీంతో అన్షుల్‌ను జట్టులోకి తీసుకున్న హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కాంబోజ్‌కు భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ మద్దతుగా నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లో టెస్టు అరంగేట్రం చేసే ఆటగాడి నుంచి అభిమానులు ఎక్కువగా ఆశించకూడదని ఆయన అన్నారు."ఒక అరంగేట్ర ఆటగాడి నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు? అతడు 10 వికెట్లు తీస్తాడని మీరు అనుకున్నారా? అతడి కెపాసిటీని మీరు అంచనా వేయండి. అందులో ఎటువంటి తప్పులేదు. అతడిలో అద్బతమైన స్కిల్స్ ఉంటే కచ్చితంగా తిరిగి పుంజుకుంటాడు. తొలి మ్యాచ్‌లో ఎలాంటి ప్లేయర్‌పై నైనా ఒత్తిడి సహజంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో అతడు మెరుగైన ప్రదర్శన చేయకపోవచ్చు. తర్వాతి మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంటాడని నమ్ముతున్నారు. ప్రతీ ఒక్కరిపై నమ్మకం అనేది ముఖ్యం. కేవలం ఒక్క మ్యాచ్‌తో ఎవరి టాలెంట్‌ను అంచనా వేయద్దు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్ పేర్కొన్నాడు.కాగా మాంచెస్టర్ టెస్టులో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడ్డ భారత్‌ను కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ జోడీ ఆదుకుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 174 పరుగులు చేసింది. ఇంకా ఇంగ్లండ్ కంటే టీమిండియా 137 పరుగులు వెనుకబడి ఉంది. -
'మరి ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తారా.. మీకంటే అనిల్ కుంబ్లే బెటర్'
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లు కాస్త పర్వాలేదన్పించినప్పటికి.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి ప్రధాన పేసర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. వికెట్ల విషయం పక్కన పెడితే సరైన లైన్ అడ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు.సరైన వేగంతో బౌలింగ్ చేయడంలో కూడా ఫాస్ట్ బౌలర్లు విఫలమయ్యారు. అరంగేట్ర బౌలర్ అన్షుల్ కాంబోజ్ది సైతం ఇదే కథ. ఓ వికెట్ పడగొట్టినప్పటికి భారీ పరుగులు మాత్రం సమర్పించుకున్నాడు. భారత బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. స్టోక్స్ సేన ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో బౌలింగ్ యూనిట్‌పై భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ విమర్శల వర్షం కురిపించాడు. ముఖ్యంగా అరంగేట్ర ఆటగాడు అన్షుల్ కాంబోజ్, మహ్మద్ సిరాజ్‌లను సిద్ధూ టార్గెట్ చేశాడు."మాంచెస్టర్‌లో మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్ గంటకు 120 నుంచి 130 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా ఈ వేగంతో బౌలింగ్ చేయగలడు. కాంబోజ్ తొలి టెస్టు ఆడుతున్నప్పటికి ఈ రకమైన బౌలింగ్ చేయడం సరికాదు. వికెట్లు తీయకపోయినా కనీసం బ్యాటర్లను కట్టడి చేయాలి.అదేవిధంగా శార్ధూల్ ఠాకూర్‌ను తిరిగి మళ్లీ జట్టులోకి ఎందుకు తీసుకున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. అతడు బ్యాటింగ్‌లో 30 నుంచి 40 పరుగుల వరకు జట్టుకు అందించవచ్చు. కానీ బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. వికెట్ల విషయం పక్కన పెడితే, ప్రసిద్ద్ కృష్ణలా 15 ఓవర్లు పాటు పరుగులు ఎక్కువగా ఇవ్వకుండా బౌలింగ్ చేయగలడా? అదేవిధంగా మూడో రోజు ఆటలో 68 ఓవర్ జడేజాతో బౌలింగ్ చేయంచడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన సుందర్‌ను అంత అలస్యంగా ఎటాక్‌లోకి ఎందుకు తీసుకొచ్చారు? సుందర్ ఒక అద్బుతమైన స్పిన్నర్. ఈ మ్యాచ్‌లో అతడు హ్యారీ బ్రూక్‌కు వేసిన డెలివరీ నాకు దిగ్గజ స్పిన్నర్ ఎరపల్లి ప్రసన్నను గుర్తు చేసింది" అని తన యూట్యూబ్ ఛానల్లో సిద్దూ పేర్కొన్నాడు. -
ఏయ్.. అక్కడేమి చేస్తున్నావ్? యువ ఆటగాడిపై జడేజా ఫైర్! వీడియో వైరల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తడబడుతోంది. వరుసగా రెండు రోజుల పాటు భారత్‌పై ఆతిథ్య ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 186 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్(150) అద్బుతమైన సెంచరీతో కదం తొక్కాడు. తన సూపర్ బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఆఖరికి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రూట్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అయితే సెంచరీతో మెరిసిన జో రూట్‌కు మూడో రోజు ఆట ఆరంభంలోనే భారత ఫీల్డర్లు ఓ లైఫ్‌లైన్ ఇచ్చేశారు. రూట్ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ భారత ఫీల్డర్ల తప్పిదం వల్ల ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా తన సహచర ఆటగాడు అన్షుల్ కాంబోజ్‌పై కోపంతో ఊగిపోయాడు.ఏమి జరిగిందంటే?ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 54 ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని రూట్ గల్లీ దిశగా ఆడాడు. గల్లీ పొజిషేన్‌లో ఉన్న జైశ్వాల్ ఆ బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. జైశ్వాల్ చేతికి తాకి కాస్త దూరంగా వెళ్లిన బంతిని జడేజా అందుకున్నాడు. అయితే బంతిని చూస్తూ ఉండిపోయిన రూట్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు వెళ్లేందుకు ఆలస్యం చేశాడు.ఈ క్రమంలో బంతిని అందుకున్న జడేజా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు త్రో చేశాడు. కానీ బంతి మాత్రం స్టంప్స్‌కు తాకలేదు. అయితే జడేజా విసిరిన బంతిని అందుకోవడనికి కూడా కనీసం స్టంప్స్ దగ్గర ఎవరూ లేరు. జడేజా విసిరిన బంతిని మిడ్-ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కాంబోజ్ అందుకున్నాడు.కానీ కాంబోజ్ ముందే బంతిని తీసుకోవడానికి స్టంప్స్ దగ్గరకు రాకపోవడంతో జడేజా సీరియస్ అయ్యాడు. అక్కడ ఏమిచేస్తున్నావు? ఇక్కడకు రావాలి కాదా అంటూ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒకవేళ రూట్ రనౌట్ అయ్యింటే ఇంగ్లండ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.చదవండి: IND vs ENG: టీమిండియాకు డేంజర్ బెల్స్.. పేస్ గుర్రానికి ఏమైంది?pic.twitter.com/Fh7dXQIX4S— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 25, 2025 -
అతడు ఫిట్‌గానే ఉన్నాడు కదా.. అన్షుల్‌ను ఎలా తీసుకున్నారు?
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడ్డ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) స్థానాన్ని సీనియర్ శార్దూల్ ఠాకూర్‌తో భర్తీ చేసిన యాజమాన్యం.. ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కంబోజ్ను అరంగేట్రం చేయించింది.కరుణ్‌పై వేటుఇక వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న కరుణ్ నాయర్ (Karun Nair)పై వేటు వేసిన సెలక్టర్లు.. తొలి టెస్టులో ఆడిన సాయి సుదర్శన్‌ను మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి చేర్చారు. అయితే, ఈ తుదిజట్టు కూర్పుపై భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ విమర్శలు గుప్పించాడు. ఏ ప్రాతిపదికన అన్షుల్ కంబోజ్‌కు అవకాశం ఇచ్చారని ప్రశ్నించాడు.క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ వచ్చాడు. ఆకాశ్ దీప్ ఆడటం లేదు కాబట్టి.. అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేశాడు. ఇక శార్దూల్ ఠాకూర్ పునరాగమనం కూడా ఆసక్తికరమే.ప్రసిద్ ఫిట్‌గా ఉన్నాడుయువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అయినప్పటికీ.. అకస్మాత్తుగా అతడిని పక్కనపెట్టారు. తుదిజట్టులో అతడికి స్థానం దక్కలేదు.అన్షుల్ అరంగేట్రం ఎలా సాధ్యం?నిజానికి అన్షుల్ కంబోజ్ మొదటి నుంచి జట్టులో భాగమే కాదు. అతడి కంటే ముందు హర్షిత్ రాణా జట్టులో ఉన్నాడు. కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. కొత్తగా వచ్చిన అన్షుల్ అరంగేట్రం చేశాడు.అసలు మేనేజ్మెంట్ ఆలోచన ఎలా ఉందో.. వారు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అంటూ మురళీ కార్తిక్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.సాయి సుదర్శన్‌పై ప్రశంసలుఅదే విధంగా.. సాయి సుదర్శన్ గురించి మాట్లాడుతూ.. ‘‘తొలి రోజు ఆటలో అతడే హైలైట్. అతడు క్రీజులో ఉన్నపుడు వికెట్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేమీ లేదు. అయినా సరే సాయి అదరగొట్టాడు. అందుకే అతడు ప్రశంసలకు అర్హుడు’’ అని మురళీ కార్తిక్ కొనియాడాడు.తొలిరోజు మెరుగ్గానేకాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తయ్యాయి. ఇంగ్లండ్ రెండు గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉండగా... మాంచెస్టర్‌లో బుధవారం మొదలైన నాలుగో టెస్టులో గెలిస్తేనే భారత్‌కు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) రాణించగా.. సాయి సుదర్శన్ అద్భుత అర్ధ శతకం(61)తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 12 పరుగులకే పెవిలియన్ చేరగా.. రిషభ్ పంత్ 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా 19, శార్దూల్ ఠాకూర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్ -
Anshul Kambo: జెర్సీ నంబర్ 'ఏకే-47'
దాదాపు ఆరు వారాల క్రితం... నార్తాంప్టన్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్ ‘ఎ’ తలపడిన అనధికారిక టెస్టులో అన్షుల్ కంబోజ్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీయడంతో పాటు అతను అర్ధ సెంచరీ కూడా సాధించాడు. మరో 10 రోజుల్లో భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా జట్టులో ప్రధాన పేసర్ ఒకరు గాయంతో బాధపడుతుండటంతో ముందు జాగ్రత్తగా మరో పేసర్‌ను టీమ్‌తో చేర్చాలని మేనేజ్మెంట్ భావించింది. ‘ఎ’ తరఫున ప్రదర్శన చూసిన తర్వాత కంబోజ్‌కు అవకాశం దక్కవచ్చని అంతా అనుకున్నారు. అయితే హర్షిత్ రాణాను జట్టు ఎంచుకుంది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాతి రోజు ఉదయమే తాను రోజూ సాధన చేసే అకాడమీకి కంబోజ్ చేరుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి వస్తూ వస్తూ అతను కొన్ని డ్యూక్స్ బంతులను వెంట తెచ్చుకున్నాడు. సింగిల్ స్టంప్‌ను పెట్టుకొని వాటితో ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు. కోచ్ ఎలా ఉన్నావు అడిగితే ‘అంతా బాగుంది సర్. కానీ నాకు ఇంకా నమ్మకం ఉంది’ అంటూ జవాబిచ్చాడు. జట్టులో స్థానంపై ఆశలు కోల్పోని కంబోజ్‌కు కొద్ది రోజులకే తీపి కబురు వచ్చింది. డ్యూక్స్ బంతులతో సాధన ఇంగ్లండ్‌తో మ్యాచ్ కోసమేనా అన్నట్లుగా వచ్చీ రాగానే టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం కూడా లభించింది. – సాక్షి క్రీడా విభాగంహరియాణాలో బాక్సర్లకు అడ్డా అయిన కర్నాల్ సమీపంలో ఫజీల్పూర్ అన్షుల్ స్వస్థలం. చాలా మందిలాగే అతనూ మట్టి మైదానాల్లో క్రికెట్ ఆడుతూ వచ్చాడు. 14 ఏళ్ల వయసు వచ్చాకే బౌలింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. తండ్రి ఉధమ్ సింగ్ అన్ని రకాలుగా అండగా నిలవగా... స్థానిక కోచ్ సతీశ్ రాణా అతడిని తీర్చి దిద్దాడు. అకాడమీలో చేర్పించిన అనంతరం అన్షుల్ ఆట పదునెక్కింది. ఆ్రస్టేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్‌ను విపరీతంగా అభిమానించే అతను... మెక్‌గ్రాత్ తరహాలోనే పేస్ కంటే కూడా కచ్చితత్వంపైనే ఎక్కువగా ఆధారపడతాడు. భారత్‌లో స్వింగ్ బౌలింగ్‌కు బాగా అనుకూలించే మైదానంగా గుర్తింపు పొందిన లాహ్లిలో ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం కలిసి రాగా, తీవ్ర సాధనతో అన్షుల్ సీమ్ బౌలింగ్‌లో రాటుదేలాడు. ఇప్పుడే అదే ప్రత్యేకత అతడిని తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యేలా చేసింది. నాన్నకు ఆనందం పంచుతూ... ఆరేళ్ల క్రితం భారత అండర్–19 జట్టుకు ఎంపిక కావడం అన్షుల్ కెరీర్లో కీలక మలుపు. నిజానికి అంతకు కొద్ది రోజుల ముందే అండర్–19 వరల్డ్ కప్‌లో ఆడే భారత జట్టులో చోటు లభించే అవకాశం రాగా, గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఆ సమయంలో తీవ్రంగా బాధపడిన అన్షుల్ ఆటను వదిలేద్దామనుకున్నాడు. కానీ అతనిలోని ప్రతిభ గురించి తెలిసిన తండ్రి కొనసాగమని గట్టిగా ప్రోత్సహించాడు. దాంతో పట్టుదలగా ఆడుతూ ముందుకు వెళ్లిన అన్షుల్ 2022లో తొలిసారి హరియాణా తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగాడు. మూడేళ్లు గడిచేసరికి ఇప్పుడు భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటంతో తండ్రి ఆనందానికి అవధుల్లేవు. గత పదేళ్లుగా ఉధమ్ సింగ్ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కంబోజ్ ఎంపిక తండ్రి బాధలన్నీ ఒక్క క్షణంలో దూరం చేసిందని అతని సోదరుడు సంయమ్ చెప్పాడు. కంబోజ్ మ్యాచ్ ఆడే సమయంలోనే అతని తల్లికి కిడ్నీ సంబంధిత సర్జరీ కూడా ఉంది. ఆ సమయంలో కొడుకు లేకపోయినా... కోలుకున్న తర్వాత ఆ కుటుంబంలో కనిపించే సంతోషం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 24 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టిన అన్షుల్ తొలి టెస్టులో బౌలింగ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు.ఆ రెండు ప్రదర్శనలు...అన్షుల్ అనూహ్యంగా దూసుకు వచ్చిన తరహా ఆటగాడు కాదు. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. 2023–24 సీజన్ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని హరియాణా గెలుచుకోవడంలో 17 వికెట్లతో అతను కీలక పాత్ర పోషించాడు. ఇది అతనికి రూ.20 లక్షలతో తొలి ఐపీఎల్ అవకాశం ఇప్పించింది. 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడగలిగాడు. తొలి మ్యాచ్‌లో ట్రవిస్ హెడ్‌ను క్లీన్‌బౌల్డ్ చేయగా... అది నోబాల్‌గా తేలింది. ఈ స్థాయిలో ఆడటం అంత సులువు కాదని అది తనకు నేర్పించిందని అతను గుర్తు చేసుకున్నాడు. అన్షుల్ ప్రతిభకు ఐపీఎల్ 2025లో గుర్తింపు దక్కింది. వేలంలో రూ.3 కోట్ల 40 లక్షలకు అతడిని సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లలో అవకాశం ఇచ్చింది. ఈ హరియాణా ప్లేయర్ తన పేరును, జెర్సీ నంబర్‌ను ఒకే చోట చేర్చి (అన్షుల్ కంబోజ్–ఏకే 47) పేరుతో జెర్సీని ధరించి ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. గత సీజన్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘సి’ తరఫున ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన అన్షుల్, రంజీ మ్యాచ్‌లో కేరళపై ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఘనతను అందుకున్నాడు. అనంతపురంలో జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై భారత్ ‘సి’ 525 పరుగులు చేయగా... అన్షుల్ దెబ్బకు ‘బి’ 332 పరుగులకే ఆలౌటైంది. ‘ప్రతిభ మాత్రమే కాదు...జహీర్, బుమ్రా తరహాలో తనదైన వ్యూహంతో బౌలింగ్ చేయగల అరుదైన పేసర్ అన్షుల్’ అంటూ అతని సీఎస్కే సహచరుడు అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్ గడ్డపై తనకు లభించిన అవకాశాలను అన్షుల్ సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లడం ఖాయం. -
అనిల్ కుంబ్లే తర్వాత అన్షుల్.. బీసీసీఐ స్పెషల్ వీడియో వైరల్
ఊహించిందే జరిగింది.. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా భారత యువ పేసర్ అన్షుల్ కంబోజ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆకాశ్ దీప్ స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. తద్వారా మాంచెస్టర్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా అన్షుల్ రికార్డులకెక్కాడు.కుంబ్లే తర్వాత అన్షులేఅంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 1990లో ఇదే వేదికపై భారత్ తరఫున తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే, ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే..ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అనిల్ కుంబ్లే, అన్షుల్ కంబోజ్ ఇద్దరూ 10 వికెట్ల హాల్ కలిగి ఉండటం విశేషం. ఓ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతి కొద్ది మంది బౌలర్ల జాబితాలో ఉన్న వీరు.. ఒకే వేదికపై టెస్టులో అడుగుపెట్టడం గమనార్హం.ఎవరీ అన్షుల్ కంబోజ్?కాగా భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో అన్షుల్ 318వ ప్లేయర్. 24 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ స్వస్థలం హర్యానాలోని కర్నాల్. గతేడాది రంజీ ట్రోఫీలో భాగంగా రోహ్తక్ వేదికగా కేరళతో మ్యాచ్‌లో అన్షుల్ అదరగొట్టాడు. కేరళ ఇన్నింగ్స్‌లో పది వికెట్లు కూల్చి సత్తా చాటాడు.తాజాగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుతో అన్షుల్ కంబోజ్ అరంగేట్రం సందర్భంగా... భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కాగా 2022లో ఢిల్లీ వేదికగా త్రిపురతో మ్యాచ్ సందర్భంగా అన్షుల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు.గత మూడేళ్లకాలంలో ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్‌లు ఆడిన అన్షుల్ కంబోజ్ 79 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు.. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో 486 పరుగులు కూడా ఉన్నాయి. గతేడాది దులిప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-సి తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన కంబోజ్ 16 వికెట్లు తీశాడు.ఇంగ్లండ్ గడ్డ మీదఇక ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్-ఎ ఆడిన అనధికారిక టెస్టు సిరీస్‌లోనూ అన్షుల్ కంబోజ్ భాగమయ్యాడు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండో అనధికారిక టెస్టులో నాలుగు వికెట్లు కూల్చడంతో పాటు.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి కెరీర్లో ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.ఇక ఐపీఎల్లో గతేడాది ముంబై ఇండియన్స్‌కు ఆడిన అన్షుల్.. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటి వరకు మొత్తంగా పదకొండు మ్యాచ్‌లు ఆడి పది వికెట్లు కూల్చాడు.వెనుకబడిన టీమిండియాఇదిలా ఉంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు శుబ్‌మన్ గిల్. అతడి సారథ్యంలో లీడ్స్‌లో తొలి టెస్టు ఓడిన టీమిండియా.. ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచి చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. అయితే, లార్డ్స్‌లో చివరి వరకు పోరాడి టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్టు జరుగుతోంది. ఈ వేదికపై ఒక్కసారి కూడా టెస్టు మ్యాచ్ గెలవని టీమిండియా.. ఈసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని పట్టుదలగా ఉంది.ఇక ఈ మ్యాచ్‌కు ముందే ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ గాయాల వల్ల దూరం కాగా.. వీరి స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుదిజట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ గిల్ వెల్లడించాడు. మరోవైపు.. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కరుణ్ నాయర్‌పై వేటు పడగా.. సాయి సుదర్శన్ రీఎంట్రీ ఇచ్చాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.Shine on, young lad 🙌🙌#TeamIndia #ENGvIND https://t.co/BLDRZz8Gu7— BCCI (@BCCI) July 23, 2025 -
ENG Vs IND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. టీమిండియాలో మూడు మార్పులు
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో ఇవాళ (జులై 23) మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా మూడు మార్పులు చేసింది. కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ స్థానాల్లో సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాచ్‌తో 24 హర్యానా యువ పేసర్ అన్షుల్ కంబోజ్ టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల కిందటే తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్ ఆడిన జట్టు నుంచి గాయపడిన షోయబ్ బషీర్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో లియామ్ డాసన్ తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి, మూడో టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది. తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
శార్దూల్ ఠాకూర్‌తో పాటు అతడినీ ఆడించాల్సిందే: మాజీ క్రికెటర్లు
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో కీలకమైన నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్ధమైంది. అయితే, ఇంగ్లండ్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గాయాల బెడద వేధించడం ఆందోళన రేకెత్తిస్తోంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలి గాయం వల్ల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అదే విధంగా.. పేస్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్ గాయాల వల్ల మాంచెస్టర్ టెస్టు ఆడటం లేదు. దీంతో తుదిజట్టు కూర్పుపై ఇంత వరకు స్పష్టత రాలేదు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు మహ్మద్ కైఫ్, సంజయ్ బంగర్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, ఆకాశ చోప్రా, దీప్‌దాస్ గుప్తా తదితరులు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించారు. లార్డ్స్‌లో మూడో టెస్టు ఆడిన జట్టులో కైఫ్ రెండు మార్పులు సూచించాడు. గాయంతో సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానాన్ని శార్దూల్ ఠాకూర్‌తో భర్తీ చేస్తే బాగుంటుందన్నాడు.అదే విధంగా.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు అన్క్యాప్డ్ పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను ఆడించాలని సూచించాడు. ప్రసిద్ క్రిష్ణ కంటే అన్షుల్ బెటర్ ఆప్షన్ అని అభిప్రాయపడ్డాడు.మరోవైపు.. సంజయ్ బంగర్ సైతం శార్దూల్ ఠాకూర్‌ను ఆడించాలని సూచించాడు. ఇప్పటికే జట్టులో ఉన్న ఇద్దరు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు శార్దూల్ కూడా ఉంటే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.అయితే, అన్షుల్‌ను కాకుండా అనుభవమున్న ప్రసిద్ కృష్ణను పేస్ దళంలో చేర్చాలని బంగర్ సూచించడం గమనార్హం. అయితే, కైఫ్, బంగర్‌లకు భిన్నంగా నవజ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం శార్దూల్ ఠాకూర్ జట్టుకు అవసరం లేదంటూ కుండబద్దలు కొట్టాడు.అదే విధంగా.. కరుణ్ నాయర్‌కు బదులు ధ్రువ్ జురెల్‌ను, ప్రసిద్ కృష్ణ లేదంటే అన్షుల్ కాంబోజ్‌లలో ఒకరిని జట్టులో చేర్చాలని సూచించాడు. మరోవైపు.. దీప్‌దాస్ గుప్తా మాత్రం కైఫ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. నితీశ్ రెడ్డికి బదులు బ్యాటర్ శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్‌నకు బదులు అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.మహ్మద్ కైఫ్ ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.సంజయ్ బంగర్ ఎంచుకున్న తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.తుదిజట్టుపై నవజ్యోత్ సింగ్ సిద్ధు అంచనాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్/ధ్రువ్ జురెల్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ/అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.దీప్‌దాస్ గుప్తా ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.కాగా బుధవారం (జూలై 23) నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మొదలుకానుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం ఇందుకు వేదిక. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. -
IND vs ENG: భారత తుదిజట్టులో మూడు మార్పులు ఇవే!
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. లార్డ్స్‌లో మూడో టెస్టు ఆడిన తుదిజట్టులో మూడు మార్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ వరుసగా విఫలమవుతున్నాడన్న ఇర్ఫాన్ పఠాన్.. అతడిని పక్కకపెట్టక తప్పదన్నాడు.కరుణ్ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు చోటివ్వాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ఇంగ్లండ్ బౌలర్లు లెఫ్టాండర్ బ్యాటర్లను ఎదుర్కోవడంలో అంతగా సఫలం కాలేకపోతున్నారని.. అందుకే సాయికి మరో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు. అదే విధంగా.. అనివార్యమైన మరో రెండు మార్పుల గురించి కూడా ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తావించాడు.కరుణ్ నాయర్ బెంచ్ మీదేఈ మేరకు.. ‘‘కరుణ్ నాయర్ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికి అతడి అత్యధిక స్కోరు 40 మాత్రమే. అయితే, మంచి బంతులకే అతడు అవుటయ్యాడు.ఒకవేళ అతడు పరుగులు రాబట్టడంలో సతమతమవుతున్నాడని భావిస్తే.. తప్పకుండా అతడిని బెంచ్‌కే పరిమితం చేయాలి. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడించాలి. ఎందుకంటే అతడు ఎడమ చేతి వాటం బ్యాటర్. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టులను పరిశీలిస్తే ఇంగ్లండ్ బౌలర్లు లెఫ్టాండర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.వికెట్ కీపర్‌గా జురెల్ఇక రిషభ్ పంత్ కూడా గాయపడ్డాడనే సమాచారం ఉంది. కాబట్టి అతడు ఈసారి కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ వస్తే.. బ్యాటింగ్ విభాగంగా మరింత పటిష్టం అవుతుంది.భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతడు 90 పరుగులతో ఆకట్టుకున్న విషయాన్ని మర్చిపోవద్దు. బ్యాటర్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. వికెట్ కీపర్‌గా అతడు మరింత మెరుగుపడాలి.అన్షుల్ వద్దు.. అతడే బెటర్ఇక పేసర్ ఆకాశ్ దీప్ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అతడి ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా ఇప్పుడు ప్రసిద్ కృష్ణ జట్టులోకి వస్తాడు. అన్షుల్ కాంబోజ్ కూడా ఒకే. కానీ కీలక మ్యాచ్‌లో ప్రసిద్ కృష్ణనే ఆడిస్తే బెటర్. అతడి అనుభవం అక్కరకు వస్తుంది.ఇక అర్ష్‌దీప్ సింగ్ గాయపడి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. కాబట్టి ఎలా చూసినా ప్రసిద్‌కు లైన్ క్లియర్ అయినట్లే. అన్షుల్ కాంబోజ్ తుదిజట్టులో ఉంటే బాగుంటుంది. అతడి బౌలింగ్ శైలి నాకెంతో ఇష్టం.కానీ ప్రస్తుతం అరంగేట్ర బౌలర్ కన్నా.. అనుభవజ్ఞుడైన బౌలర్ అవసరం ఉంది కాబట్టి.. నేను ప్రసిద్ వైపు మొగ్గుచూపుతాను’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్, ఆకాశ్ దీప్ ప్లేస్‌లో ప్రసిద్ కృష్ణను ఆడించాలన్న పఠాన్.. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానాన్ని బ్యాటర్ ధ్రువ్ జురెల్‌తో భర్తీ చేయాలని సూచించాడు. కాగా టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్ వేదిక.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. చదవండి: IND vs ENG: అతడిని కాదని అన్షుల్‌ను ఎలా ఎంపిక చేస్తారు?: సెలక్టర్లపై ఫైర్ -
అతడిని కాదని అన్షుల్‌ను ఎలా ఎంపిక చేస్తారు?: సెలక్టర్లపై ఫైర్
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు నేపథ్యంలో ఆల్‌రౌండర్ అన్షుల్ కాంబోజ్ (Anshul Kamboj) కొత్తగా టీమిండియాలోకి చేరాడు. స్టార్ క్రికెటర్లు గాయాల పాలు కావడంతో ఈ హర్యానా ఆటగాడికి ఈ మేర బంపరాఫర్ దక్కింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కాగా.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) నాలుగో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.మరోవైపు.. మరో పేసర్ ఆకాశ్ దీప్ ఫిట్‌నెస్‌పై కూడా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రైటార్మ్ పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోమవారం అధికారికంగా వెల్లడించింది.అతడిని కాదని అన్షుల్‌ను ఎలా ఎంపిక చేస్తారు?అయితే, సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం సరికాదంటూ భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. హర్షిత్ రాణాను కాదని అన్షుల్ కాంబోజ్‌ను ఎలా పిలిపించారని ప్రశ్నించాడు. అసలు టీమిండియాలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదుకాగా ఇంగ్లండ్-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ మెరుగైన ప్రదర్శన కనబరిచారు. అయితే, ఇంగ్లండ్‌తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ జట్టులోకి అదనపు ఆటగాడిగా హర్షిత్ రాణాను తీసుకుని.. అక్కడే ఉంచింది యాజమాన్యం.అయితే, హర్షిత్ ఎంపికపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. అతడు కొన్ని రోజులకే స్వదేశానికి తిరిగి రావడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇలా గాయాల బెడద నేపథ్యంలో అన్షుల్‌ను పిలిపించింది మేనేజ్మెంట్.అపుడు హర్షిత్.. ఇపుడు అన్షుల్ ఎందుకు?ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘హర్షిత్ రాణా లేడు. ఇపుడేమో ఇతడు. అసలు టీమిండియాలో ఏం జరుగుతోందని మనమంతా ఆశ్చర్యపోవాలా? ఎవరు జట్టులోకి వస్తారు? ఎవరిని ఎప్పుడు తీసేస్తారు? అన్న విషయాలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు?భారత్-ఎ తరఫున ప్రదర్శన గురించి మాట్లాడితే అన్షుల్ కాంబోజ్ మెరుగ్గా ఆడాడు. కానీ మీరు ముందుగా హర్షిత్ రాణాను టీమిండియాతో కొనసాగించేందుకు నిర్ణయించుకున్నారు.అలాంటపుడు అదే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సింది. కానీ ఇప్పుడు అతడు స్వదేశానికి వచ్చేశాడు. అన్షుల్ కాంబోజ్‌ని అక్కడే ఉంచారు. అంతా గందరగోళంగా ఉంది. మేనేజ్మెంట్కు ఈ విషయంలో స్పష్టత ఉండవచ్చేమో గానీ.. మనకు ఎవరూ ఏమీ చెప్పరు.అయినా, టీమిండియాలో ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఏదేమైనా అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వచ్చేందుకు అర్హుడు. ఎట్టకేలకు అతడు టీమిండియాతో చేరాడు’’ అని పేర్కొన్నాడు.వీరి ప్రదర్శన ఇలాకాగా ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2024-25 సందర్భంగా 23 ఏళ్ల హర్షిత్ రాణా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్-ఎ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో మాత్రం అతడు రెండు మ్యాచ్‌లలో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు.మరోవైపు.. 24 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ నార్తాంప్టన్‌లో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి అజేయ అర్ధ శతకం (51)తో మెరిశాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో గిల్ సేన ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉంది. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్ (జూలై 23-27)లో నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు టీమిండియా (అప్డేటెడ్)శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ & వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.చదవండి: శతక్కొట్టిన భారత సంతతి బ్యాటర్.. వైభవ్ సూర్యవంశీ మళ్లీ ఫెయిల్! -
Indian Cricket: టీమిండియాలోకి రైతుబిడ్డ
-
IND vs ENG: కరుణ్‌పై వేటు.. అతడి అరంగేట్రం?.. తుదిజట్టు ఇదే!
స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడిన నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు క్లిష్టతరంగా మారింది. పేసర్లలో ఆకాశ్ దీప్ (Akash Deep) ఫిట్‌నెస్‌లేమితో సతమతమవుతుండగా.. అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు.. లోయర్ ఆర్డర్లో మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించగల ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.శార్దూల్ ఠాకూర్ మళ్లీ జట్టులోకి?ఎడమ మోకాలికి గాయమైన కారణంగా నితీశ్ రెడ్డి ఇంగ్లండ్‌తో మిగిలిన ఉన్న రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ టెస్టు కోసం జట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి స్థానంలో సీనియర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాడా? అనే చర్చ జరుగుతోంది.లేదంటే.. బీసీసీఐ తాజాగా జట్టులోకి తీసుకున్న మరో ఆల్‌రౌండర్ అన్షుల్ కాంబోజ్‌పై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతుందేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శార్దూల్, అన్షుల్ ఇద్దరూ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లే కాబట్టి.. వీరిలో ఒకరికే అవకాశం ఇచ్చి.. ఆకాశ్ దీప్ స్థానాన్ని ప్రసిద్ కృష్ణతో భర్తీ చేస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది.తద్వారా అన్షుల్ రూపంలో ఆల్‌రౌండర్‌తో పాటు ప్రసిద్‌ను తీసుకోవడం ద్వారా పేస్ బౌలింగ్ దళం బలం కూడా పెరుగుతుంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు తోడుగా ప్రసిద్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది.ధ్రువ్ జురెల్‌కు ఛాన్స్అయితే, బ్యాటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలనుకుంటే మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు ఛాన్స్ దక్కుతుంది. నిజానికి నాలుగో టెస్టులో రిషభ్ పంత్ వేలి గాయం కారణంగా.. కేవలం బ్యాటర్‌గానే అందుబాటులో ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వికెట్ కీపర్‌గా జురెల్‌కు లైన్ క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.కరుణ్ నాయర్‌పై ఈసారి వేటుమరోవైపు.. వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌పై ఈసారి వేటు పడే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే యువ ఆటగాడు సాయి సుదర్శన్ తన కెరీర్లో రెండో టెస్టు ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ టెస్టు వికెట్ దృష్ట్యా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఈసారైనా బరిలోకి దింపాలనే సూచనలు వస్తున్నాయి.కుల్దీప్ను ఈసారైనా ఆడించండిబంతిని రెండు వైపులా టర్న్ చేయగల సత్తా కుల్దీప్‌నకు ఉందని.. అతడిని నాలుగో టెస్టులో ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. దూకుడుగా ఆడే ఇంగ్లండ్ బ్యాటర్లు అంత సులువుగా కుల్దీప్ను అటాక్ చేయలేరని.. కాబట్టి అతడిని తప్పక తీసుకోవాలని సూచించాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో ఉన్న రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లకు కుల్దీప్ కూడా తోడైతే జట్టు మరింత పటిష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2-1తో ఆధిక్యంలో ఇంగ్లండ్కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లింది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ సేన జయభేరి మోగించింది. ఇరుజట్ల మధ్య లార్డ్స్‌లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 22 పరుగుల తేడాతో గెలిచిన స్టోక్స్ బృందం.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సంపాదించింది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్ వేదిక. ఇందులో భారత్ తప్పకుండా గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత తుదిజట్టు (అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్/అన్షుల్ కాంబోజ్.చదవండి: ‘వైభవ్ సూర్యవంశీని చూడగానే ఫిక్సయిపోయాం.. అతడొక అద్భుతం’ -
BCCI: నితీశ్ రెడ్డితో పాటు అతడూ అవుట్.. జట్టులోకి కొత్త ప్లేయర్
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు (IND vs ENG)కు ముందు టీమిండియాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రిషభ్ పంత్ (Rishbah Pant) వేలి గాయంతో కేవలం బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడని తెలుస్తుండగా.. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.ఎడమ మెకాలికి గాయమైన కారణంగా ఈ ఆంధ్రా కుర్రాడు.. ఇంగ్లండ్ నుంచి తిరిగి స్వదేశానికి రానున్నాడు. మరోవైపు.. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా మాంచెస్టర్ టెస్టుకు దూరమయ్యాడు. బెకెన్‌హామ్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా అతడి ఎడమ చేతి వేలికి గాయమైంది.నాలుగో టెస్టుకు దూరంఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో అర్ష్‌దీప్ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, ఈ పంజాబీ బౌలర్ ఇప్పట్లో కోలుకునేలా లేడు. అందుకే నాలుగో టెస్టుకు అతడు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో మెన్స్ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అన్షుల్ కంబోజ్ను జట్టుకు ఎంపిక చేసింది. మాంచెస్టర్ టెస్టు సందర్భంగా అతడు జట్టుతో చేరనున్నాడు. ఇందుకు సంబంధించి బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.గాయాల బెడదకాగా శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే మూడు పూర్తికాగా ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో చారిత్రాత్మ విజయం సాధించిన టీమిండియా.. మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)నూ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే, ఈ వేదికపై ఇంత వరకు ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు గెలవకపోవడం.. పైగా ఇలా గాయాల బెడద వేధిస్తుండటం ఆందోళనకరంగా మారింది.ఇదిలా ఉంటే.. లీడ్స్‌లో ఆడిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బదులు.. నితీశ్ కుమార్ రెడ్డి రెండో టెస్టు నుంచి జట్టులోకి వచ్చాడు. అయితే, అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. చివరగా లార్డ్స్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా కేవలం 43 పరుగులే చేశాడు.మరోవైపు.. టీమిండియా తరఫున టీ20, వన్డేలలో అదరగొడుతున్న అర్ష్‌దీప్ ఇంత వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఇక హర్యానాకు చెందిన అన్షుల్ కాంబోజ్ ఇటీవల ఇంగ్లండ్‌తో భారత్-‘ఎ’ జట్టు తరఫున అనధికారిక సిరీస్ ఆడాడు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లు తీసిన అన్షుల్ రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో వచ్చి అజేయ అర్ధ శతకం (51) సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీయడంతో ఆపటు 486 పరుగులు చేశాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత జట్టు (అప్డేటెడ్ ):శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ & వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.చదవండి: BAN vs PAK: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ -
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. బీసీసీఐ కీలక నిర్ణయం! ధోని శిష్యుడికి పిలుపు
మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత టెస్టు జట్టులోకి యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను బీసీసీఐ చేర్చింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆకాష్ దీప్ గాయపడగా.. నాలుగో టెస్టు కోసం ప్రాక్టీస్ సందర్భంగా అర్ష్‌దీప్ చేతి వేలికి గాయమైంది. అర్ష్‌దీప్ కోలుకోవడానికి దాదాపు 10 రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్షుల్ కాంబోజ్‌కు తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు.దీంతో అతడు ఉన్నపళంగా భారత్ నుంచి లండన్‌కు బయలుదేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనాధికారిక టెస్టుల్లో భారత-ఎ తరపున కాంబోజ్ ఆడాడు. ఈ సిరీస్‌లో కాంబోజ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ పేసర్ 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు.అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్-2025 సీజన్లో ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్కే తరపున ఆడాడు. ఐపీఎల్లో కూడా తన బౌలింగ్ ప్రదర్శనతో కాంబోజ్ ఆకట్టుకున్నాడు. అతడికి అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. గంటకు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట ఓ పది వికెట్ల హాల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి సీనియర్ జట్టులోకి తీసుకున్నారు. ఇక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత జట్టు 2-1 తేడాతో వెనకబడి ఉంది. దీంతో నాలుగో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-1తో సమం చేయాలని గిల్ బృందం భావిస్తోంది.చదవండి: WCL: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. అఫ్రిదిపై వేటు! -
'అతడొక అద్బుతం.. ఇంగ్లండ్ టూర్‌కు సెలక్ట్ చేయండి'
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభానికి ఇంకా నాలుగు వారాల సమయం మాత్రమే మిగిలింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.అయితే ఇంగ్లండ్ టూర్‌కు ఇంకా భారత జట్టును బీసీసీఐ ఖారారు చేయలేదు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. మే 24న భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేయడం సెలక్టర్లకు బిగ్ ఛాలెంజ్ వంటిదే అని చెప్పాలి. ఇందుకు ఈ కీలక పర్యటనకు ముందు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికారు. దీంతో వారిద్దరూ స్ధానాలను భర్తీ చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ పర్యటనలో భారత టెస్టు జట్టులో కొన్ని కొత్త ముఖాలను చూసే అవకాశముంది. సాయిసుదర్శన్, అర్షదీప్ సింగ్‌లు టీమిండియా తరపున టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు హర్యానా స్పీడ్ స్టార్ అన్షుల్ కాంబోజ్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాలని చెన్నైసూపర్ కింగ్స్ హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచించాడు. ఐపీఎల్-2025 సీజన్లో కాంబోజ్ సీఎస్కే తరపున ఆడుతున్నాడు."కాంబోజ్ అద్బుతమైన బౌలర్. అతడు గంటకు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలడు. అతడు తన పేస్ బౌలింగ్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. కాంబోజ్ వేసే బంతులు ఎల్లప్పుడూ చేతి గ్లౌవ్స్ దగ్గరగా వెళ్తూ ఉంటాయి.దీంతో బ్యాటర్లు వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైట్ ఎక్కువగా ఉండడంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. ప్లాట్ వికెట్లపై కూడా అతడు అద్బుతంగా బౌలింగ్ చేయగలడు.ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఫ్లాట్ వికెట్లపై ఎలా రాణించాడో చూశాము. కొంచెం సీమ్, స్వింగ్ ఉన్న పరిస్థితుల్లో ఇంకా బాగా రాణిస్తాడు. కాబట్టి ఇంగ్లండ్‌కు వెళ్లే భారత జట్టులో అతడు ఉంటాడని ఆశిస్తున్నానని" ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. -
భారత క్రికెట్లో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు! 39 ఏళ్ల తర్వాత
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా రోహ్తక్ వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కాంబోజ్ 10 వికెట్లతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 30.1 ఓవర్లు బౌలింగ్ చేసిన కాంబోజ్.. 49 పరుగులిచ్చి మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.తొలి రోజు ఆటలో రెండు వికెట్లు పడగొట్టిన అన్షుల్.. రెండో రోజులో మిగితా 8 వికెట్లను నేలకూల్చాడు. తద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అన్షుల్ రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో కాంబోజ్ కంటే ముందు బెంగాల్ దిగ్గజం ప్రేమాంగ్షు ఛటర్జీ, రాజస్థాన్ మాజీ ప్లేయర్ ప్రదీప్ సుందరం ఉన్నారు. 1956-57 సీజన్లో అస్సాంపై ప్రేమాంగ్షు ఛటర్జీ ఈ ఫీట్ సాధించగా.. 1985-86 సీజన్లో విదర్భపై ప్రదీప్ సుందరం 10 వికెట్లు పడగొట్టాడు. మళ్లీ ఇప్పుడు 39 సంవత్సరాల తర్వాత అన్షుల్ కాంబోజ్ ఈ ఎలైట్ జాబితాలో చేరాడు. కాంబోజ్ బౌలింగ్ మ్యాజిక్ ఫలితంగా కేరళ తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటివరకు 19 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన కాంబోజ్.. 57 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా కాంబోజ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.ఎవరీ అన్షుల్ కాంబోజ్..?23 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ హర్యానా తరపున 2022 రంజీ సీజన్లో త్రిపురాపై ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. కాంబోజ్‌కు అద్బుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 19 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన కాంబోజ్.. 57 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.కాంబోజ్ ఐపీఎల్లో కూడా ఆడాడు. దేశీవాళీ టోర్నీల్లో సంచలన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఐపీఎల్-2024 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా జరగనున్న మెగా వేలంలో ఈ హర్యానా పేసర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది.చదవండి: IND Vs AUS: 'కింగ్ తన రాజ్యానికి తిరిగొచ్చాడు'.. ఆసీస్‌ను హెచ్చరించిన రవిశాస్త్రి -
Asia Cup: పాక్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. తుదిజట్లు ఇవే
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడుతోంది. దాయాదుల మధ్య పోరుకు ఒమన్‌లోని అల్ అమెరట్ స్టేడియం వేదికగా నిలిచింది. భారతకాలమానం ప్రకారం శనివారం రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.అభిషేక్ జోడీగా ప్రభ్సిమ్రన్సింగ్ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడే భారత తుదిజట్టులో టీమిండియా టీ20 నయా ఓపెనర్ అభిషేక్ శర్మ చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్సింగ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. కాగా ఒమన్‌లో జరుగుతున్న ఈ ఆసియా టీ20 టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ జట్లు ఇప్పటికే శుభారంభం చేశాయి.అంచనాలు రెట్టింపుహాంకాంగ్పై బంగ్లా యువ జట్టు 5 వికెట్లు, శ్రీలంక-ఎ జట్టుపై అఫ్గన్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించాయి. మరోవైపు.. మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈతో తలపడ్డ ఆతిథ్య ఒమన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో నాలుగో మ్యాచ్‌లో భారత్- పాక్ తలపడటం.. అందులోనూ టీమిండియా స్టార్లు తిలక్ వర్మ(కెప్టెన్‌గా), అభిషేక్ శర్మ ఈ జట్టులో ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి.భారత్- ‘ఎ’ వర్సెస్ పాకిస్తాన్- ‘ఎ’ తుదిజట్లుయువ భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.పాక్ యువ జట్టుహైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్! -
అన్షుల్ కాంబోజ్ సరికొత్త చరిత్ర.. అగ్రస్థానంలోకి ‘సి’ జట్టు
దులిప్ ట్రోఫీ-2024 సందర్భంగా ఇండియా-‘సి’ బౌలర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన పేసర్‌గా నిలిచాడు. ఇండియా-‘బి’తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇంతకు ముందు దేబాశీష్ మొహంతి (10/46) ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్.. తొలి రెండు రౌండ్లలో కలిపి జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఫలితం తేలగా మరో మ్యాచ్ మాత్రం పేలవమైన ‘డ్రా’గా ముగిసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనంతపురం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ఇండియా-‘బి’, ఇండియా-‘సి’ జట్లు సమంగా నిలిచాయి. ఆట నాలుగో రోజు ఉదయం వరకు కూడా ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 309/7తో ఆట కొనసాగించిన ‘బి’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్షుల్ కాంబోజ్ (8/69) ప్రత్యర్థిని పడగొట్టాడు.అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి ‘సి’ తమ రెండో ఇన్నింగ్స్‌ను 37 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ దశలో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 193 పరుగుల ఆధిక్యం సాధించిన ‘సి’ టీమ్‌కు 3 పాయింట్లు, ‘బి’ టీమ్‌కు 1 పాయింట్ లభించాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఓవరాల్‌గా తొమ్మిది పాయింట్లతో ఇండియా-‘సి’ ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అర్ధ శతకంతో మెరిసిన రుతురాజ్ఆదివారం భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 7 ఓవర్లు సరిపోయాయి. తమ స్కోరుకు మరో 23 పరుగులు జోడించి జట్టు మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడూ పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఖాతాలోకే వెళ్లగా... కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఏకంగా 193 పరుగుల ఆధిక్యం ఉండి కాస్త దూకుడుగా ఆడి విజయం కోసం సవాల్ విసిరే స్థితిలో ఉన్న ‘సి’ టీమ్ అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. సాయి సుదర్శన్ (11) విఫలం కాగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (93 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ చేశాడు. రుతురాజ్, రజత్ పటిదార్ (84 బంతుల్లో 42; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 96 పరుగులు జత చేశారు.ఇండియా-‘బి’ వర్సెస్ ఇండియా-‘సి’ స్కోర్లుఇండియా-‘బి’- 332 ఇండియా-‘సి’- 525 & 128/4 డిక్లేర్డ్ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్రెండో రౌండ్ ముగిసిన దులిప్ ట్రోఫీ-2024 పాయింట్ల పట్టిక ఇలా..👉ఇండియా- ‘సి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 9👉ఇండియా- ‘బి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 7👉ఇండియా- ‘ఎ’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(0)-ఓడినవి(1)- పాయింట్లు 7👉ఇండియా- ‘డి’- 2(ఆడినవి)- గెలిచినవి(0)- డ్రా(0)- ఓడినవి(2)- పాయింట్లు 0.చదవండి: మూడు వందల వికెట్ల క్లబ్‌కు చేరువలో కుల్దీప్