
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తడబడుతోంది. వరుసగా రెండు రోజుల పాటు భారత్‌పై ఆతిథ్య ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 186 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది.
ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్(150) అద్బుతమైన సెంచరీతో కదం తొక్కాడు. తన సూపర్ బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఆఖరికి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రూట్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అయితే సెంచరీతో మెరిసిన జో రూట్‌కు మూడో రోజు ఆట ఆరంభంలోనే భారత ఫీల్డర్లు ఓ లైఫ్‌లైన్ ఇచ్చేశారు. రూట్ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ భారత ఫీల్డర్ల తప్పిదం వల్ల ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా తన సహచర ఆటగాడు అన్షుల్ కాంబోజ్‌పై కోపంతో ఊగిపోయాడు.
ఏమి జరిగిందంటే?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 54 ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని రూట్ గల్లీ దిశగా ఆడాడు. గల్లీ పొజిషేన్‌లో ఉన్న జైశ్వాల్ ఆ బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. జైశ్వాల్ చేతికి తాకి కాస్త దూరంగా వెళ్లిన బంతిని జడేజా అందుకున్నాడు. అయితే బంతిని చూస్తూ ఉండిపోయిన రూట్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు వెళ్లేందుకు ఆలస్యం చేశాడు.
ఈ క్రమంలో బంతిని అందుకున్న జడేజా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు త్రో చేశాడు. కానీ బంతి మాత్రం స్టంప్స్‌కు తాకలేదు. అయితే జడేజా విసిరిన బంతిని అందుకోవడనికి కూడా కనీసం స్టంప్స్ దగ్గర ఎవరూ లేరు. జడేజా విసిరిన బంతిని మిడ్-ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కాంబోజ్ అందుకున్నాడు.
కానీ కాంబోజ్ ముందే బంతిని తీసుకోవడానికి స్టంప్స్ దగ్గరకు రాకపోవడంతో జడేజా సీరియస్ అయ్యాడు. అక్కడ ఏమిచేస్తున్నావు? ఇక్కడకు రావాలి కాదా అంటూ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒకవేళ రూట్ రనౌట్ అయ్యింటే ఇంగ్లండ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
చదవండి: IND vs ENG: టీమిండియాకు డేంజర్ బెల్స్.. పేస్ గుర్రానికి ఏమైంది?
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 25, 2025