
అన్షుల్ కాంబోజ్.. టీమిండియాకు మరో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ అవుతాడు. ఇవి ఇంగ్లండ్ పర్యటలో భారత తరపున టెస్టు అరంగేట్రం చేసిన పేసర్ కాంబోజ్ గురుంచి లెజెండరీ రవిచంద్రన్ అశ్విన్ అన్న మాటలు. కానీ అశ్విన్ అంచనాలను కాంబోజ్ అందుకోలేకపోయాడు. బుమ్రా, జహీర్‌లతో పోల్చడం పక్కన పెడితే కాంబోజ్ కనీస పోటీ ఇవ్వలేకపోయాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ గాయపడడంతో సెలక్టర్లు అనుహ్యంగా అన్షుల్‌కు పిలుపునిచ్చారు.
ఉన్నపళంగా మాంచెస్టర్‌కు వెళ్లిన కాంబోజ్.. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో అరంగేట్రం చేశాడు. ఈ హర్యానా పేసర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతేకాకుండా సరైన పేస్‌ను జనరేట్ చేయడంలో కూడా కాంబోజ్ ఇబ్బంది పడ్డాడు. గంటకు 120 కి.మీ వేగంతో మాత్రమే కాంబోజ్ బౌలింగ్ చేశాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఒక్క మ్యాచ్‌కే వేటు..
అయితే భారత రెడ్ బాల్ క్రికెట్ సెటాప్ నుంచి కాంబోజ్‌ను బీసీసీఐ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న అనాధికారిక టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కాంబోజ్‌కు చోటు దక్కలేదు.
ఇటీవల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో బీసీసీఐ కండక్ట్ చేసిన పేస్ బౌలర్ల క్యాంపునకు కాంబోజ్ హాజరైనప్పటికి.. ఆసీస్‌తో సిరీస్‌కు మాత్రం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అతడు తిరిగి జాతీయ జట్టలోకి రావడం అనుమానమే. ఆస్ట్రేలియా-ఎతో సిరీస్‌కు సీనియర్ పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్‌లతో పాటు యువ పేసర్లు
యశ్ ఠాకూర్గు, గుర్నూర్ బ్రార్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే అన్షుల్‌కు దేశవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. గతేడాది రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కాంబోజ్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి చరిత్ర కెక్కాడు. అంతేకాకుండా గతేడాది నుంచి ఇండియా-ఎ జట్టులో కాంబోజ్ భాగమవుతూ వస్తున్నాడు.
కానీ ఇప్పుడు జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసిన తర్వాత కూడా భారత్-ఎ జట్టు నుంచి అతడిని తప్పించడం అందరిని ఆశ్యర్యపరిచింది. కాంబోజ్ ఏమైనా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడా? లేదా సెలక్టర్లు కావాలనే పక్కన పెట్టారా తెలియాల్సింది.
ఆసీస్-తో సిరీస్‌కు భారత్-ఎ జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్,ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్