వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న జైశ్వాల్.. సిరీస్ డిసైడర్‌లో మాత్రం తన సత్తాను చూపించాడు. తొలి వన్డే సెంచరీ మార్క్‌ను అతడు అందుకున్నాడు.
అయితే జైశ్వాల్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించడంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మది కీలక పాత్రంట. ఈ విషయాన్ని జైశ్వాల్ స్వయంగా తనంతట తానే వెల్లడించాడు. రోహిత్ యువ ఆటగాళ్లకు ఎంతో సపోర్ట్‌గా ఉంటాడని, ఒకవేళ జూనియర్లను మందలించిన అందులో ప్రేమ, ఆప్యాయత ఉంటాయని జైశూ తెలిపాడు.
కాగా రోహిత్ శర్మ మైదానంలో జూనియర్లు తప్పు చేస్తే అప్పుడప్పుడు తిడుతూ ఉంటాడు. ఇటువంటి సంఘటనలు చాలా అతడి కెప్టెన్సీలో చాలా చోటు చేసుకున్నాయి. మిస్ ఫీల్డ్ చేసినప్పుడు, బౌలింగ్, బ్యాటింగ్ సరిగ్గా చేయినప్పుడు రోహిత్ తన నోటికి పనిచెప్పే వాడు. కానీ వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరము లేదని ఓ ఇంటర్వ్యూలో జైశ్వాల్ స్పష్టం చేశాడు.
"రోహిత్ భాయ్ మమ్మల్ని మందలించిన ప్రతిసారి అందులో చాలా ప్రేమ, అప్యాయత ఉంటుంది. నిజానికి రోహిత్ తిట్టక పోతానే ఏం జరిగింది? ఎందుకు మందలించడం లేదు? నేను చేసిన పనికి ఆయన బాధపడ్డాడా? అన్న అభద్రతాభావం ఏర్పడుతుంది.
రోహిత్, విరాట్ కోహ్లిలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండడం మాలాంటి యువ ఆటగాళ్లకు ఎంతో మేలు చేకూరుతోంది. వారు గేమ్ గురుంచి చర్చిస్తారు. వారి అనుభవాలను పంచుకుంటారు. వారు గతంలో చేసిన తప్పిదాలను మేము చేయకుండా ఉండడానికి సలహాలు ఇస్తారు.
రో-కో మాతో ఉంటే మేమంతా రిలాక్స్‌డ్‌గా ఉంటాము. వైజాగ్ వన్డేలో రోహిత్ భాయ్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేశాడు. రోహిత్ భాయ్ నన్ను ప్రశాతంగా, సమయం తీసుకోమని సూచించాడు. తానే రిస్క్ తీసుకుంటానని చెప్పాడు. రోహిత్ లాంటి చాలా అరుదుగా ఉంటారు.
అదేవిధంగా విరాట్ పాజీ(కోహ్లి) కూడా టార్గెట్‌ను చిన్న చిన్న లక్ష్యాలగా చేసుకుని చేధించాలని చెప్పారు. ఇక భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది నాకల. అంతేకాకుండా వస్తే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడానికి కూడా నేను సిద్దంగా ఉన్నానని 'అజెండా ఆజ్ తక్' సదస్సులో జైశ్వాల్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మారన్ మాస్టర్ ప్లాన్..! యార్కర్ల కింగ్‌పై కన్ను?


