టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఈ దేశవాళీ వన్డే టోర్నీలో రెండు లేదా మూడు మ్యాచ్‌లలో కోహ్లి ఆడే అవకాశముంది. రోహిత్ శర్మ మాత్రం పూర్తి స్దాయిలో అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోయేషిన్‌కు తెలియజేసినట్లు సమాచారం.
అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడితోనే రో-కో ద్వయం విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సముఖత చూపించారని వార్తలు వచ్చాయి. చాలా మంది మాజీలు కూడా వారిద్దరూ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారని, డొమాస్టిక్ క్రికెట్ ఆడాలని ఒత్తిడి తీసుకురావడమేంటి అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు సంచలన ప్రకటన చేశాడు.
"విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలన్నది రోహిత్, కోహ్లిల వ్యక్తిగత నిర్ణయం. అంతే తప్ప కచ్చితంగా ఆడాలని వారిని ఎవరూ ఆదేశించలేదు" అని సదరు అధికారి స్పష్టం చేశారు. కాగా రో-కో ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో దుమ్ములేపారు.
దీంతో వన్డే ప్రపంచకప్-2027లో వారిద్దరూ ఆడడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రపంచకప్ ప్రణాళికలలో రోహిత్-కోహ్లి ఉన్నారా లేదా అన్నది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ వారిద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లని, వారి అనుభవం డ్రెస్సింగ్ రూమ్‌లో అవసరమని గంభీర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: ENG vs AUS: 'చెత్త బౌలింగ్.. చెత్త బ్యాటింగ్.. చెత్త కెప్టెన్'


