వన్డే ప్రపంచకప్-2027లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడుతురా? అంటే అవునానే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సీనియర్ క్రికెటర్లు ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రో-కో అదరగొట్టారు.
కోహ్లి రెండు సెంచరీలతో సత్తాచాటి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలవగా.. రోహిత్ కూడా పరుగులు వరద పారించాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నప్పటికి మిగితా క్రికెటర్ల కంటే చాలా యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉన్నారు. వారి వయస్సు వారి జోరుకు అడ్డు కావడం లేదు.
భారత క్రికెట్‌కే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దీంతో రో-కో వన్డే ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడుతారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రపంచకప్ ప్రణాళికలలో రోహిత్-కోహ్లి ఉన్నారా లేదా అన్నది భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.
వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే అనంతరం రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్‌ను విలేకరులు ప్రశ్నించారు. "రోహిత్, కోహ్లిలు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. డ్రెస్సింగ్ రూమ్‌లో వారి అనుభవం చాలా ముఖ్యం. వారిద్దరూ భారత్ తరపున చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నారు.
రాబోయో రోజుల్లో కూడా తమ ఫామ్‌ను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఇది 50 ఓవర్ల ఫార్మాట్‌లో చాలా ముఖ్యం. అయితే వన్డే ప్రపంచకప్‌కు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. మనం వర్తమానంలో ఉండటం ముఖ్యం. జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి" అని గంభీర్ పేర్కొన్నాడు.
చదవండి: సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ


