భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ఆతిథ్య వేదికకు చేరుకుని ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. టెస్టు సిరీస్‌ను సౌతాఫ్రికా సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను మాత్రం మెన్ ఇన్ బ్లూ తమ ఖాతాలో వేసుకుంది.
ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. కటక్ టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని సూర్యకుమార్ నాయకత్వంలోని భారత్ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. దీంతో తొలి మ్యాచ్ కోసం టీమిండియా ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేద్దాం.
టైమ్స్ ఆఫ్ ఇండియా' నివేదిక ప్రకారం.. తొలి టీ20 కోసం బారాబాతి స్టేడియంలోని పిచ్‌ను ఎర్రమట్టితో తాయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వికెట్ స్పిన్నర్ల కంటే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశముంది. ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశముంది.
సుందర్‌పై వేటు..
గత కొన్ని మ్యాచ్‌లగా మూడో స్పిన్నర్‌గా ఉన్న వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేకి చోటు దక్కనున్నట్లు ఛాన్స్ ఉంది. ఎలాగో మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తుది జట్టులో ఉంటాడు. గాయం నుంచి పాండ్యా కోలుకుని తిరిగొచ్చాడు.
ఇక సీమర్లగా అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశముంది. ఒకవేళ అవసరమైతో దూబేతో బౌలింగ్ చేయిస్తారు లేదా స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఉపయోగించుకుంటారు. అయితే స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు చోటు దక్కకపోవచ్చు.
భారత ఇన్నింగ్స్‌ను శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ప్రారంభించనుండగా.. మూడు నాలుగు స్ధానాలలో సూర్యకుమార్, తిలక్ వర్మ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. ఇక వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను ఆడించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒకట్రెండు మ్యాచ్‌లలో శాంసన్ విఫలమైతే.. జితీశ్ శర్మ వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.
భారత తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ ఊహించని ప్రకటన!


