సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను మాత్రం సొంతం చేసుకుంది. మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కటక్ వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఆదివారం రాత్రి భువనేశ్వర్‌కు చేరుకున్నాయి. ప్రోటీస్, భారత్ జట్లకు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మహంతి స్వాగతం పలికారు. వైజాగ్ నుంచి అర్ష్‌దీప్, నితీశ్ కుమార్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు భువనేశ్వర్ చేరుకోగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వంటి వారు ముంబై నుంచి నేరుగా జట్టులో కలిశారు.
ఇరు జట్లు సోమవారం బారాబతి స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరు కానున్నారు. స్టేడియం, హోటల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పంకజ్ లోచన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక గాయం కారణంగా టెస్టు, వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
అతడు టీ20ల్లో ఆడనుండడం ఖాయం. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఇప్పటికే ఫిట్‌నెస్ సాధించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ములేపాడు. ఇప్పుడు అదే జోరును సఫారీలపై కొనసాగించాలని ఈ బరోడా ఆటగాడు ఉవ్విళ్లూరుతున్నాడు. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సైతం టీ20లకు అందుబాటులోకి వచ్చాడు.
సఫారీలతో టీ20లకు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ.
So Sanju Samson reached Cuttack. Today Kerala will be playing without Sanju Samson. This reminds me off 90s Indian team without Sachin. I don't think we will cross 100 without Sanju pic.twitter.com/tiuPi1TAj0
— 𝗕𝗥𝗨𝗧𝗨 (@Brutu24) December 8, 2025


