breaking news
Cuttack t-20
-
భువనేశ్వర్‌కు చేరుకున్న టీమిండియా (వీడియో)
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను మాత్రం సొంతం చేసుకుంది. మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కటక్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఆదివారం రాత్రి భువనేశ్వర్‌కు చేరుకున్నాయి. ప్రోటీస్, భారత్ జట్లకు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మహంతి స్వాగతం పలికారు. వైజాగ్ నుంచి అర్ష్‌దీప్, నితీశ్ కుమార్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు భువనేశ్వర్ చేరుకోగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వంటి వారు ముంబై నుంచి నేరుగా జట్టులో కలిశారు. ఇరు జట్లు సోమవారం బారాబతి స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరు కానున్నారు. స్టేడియం, హోటల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పంకజ్ లోచన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక గాయం కారణంగా టెస్టు, వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు టీ20ల్లో ఆడనుండడం ఖాయం. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఇప్పటికే ఫిట్నెస్ సాధించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ములేపాడు. ఇప్పుడు అదే జోరును సఫారీలపై కొనసాగించాలని ఈ బరోడా ఆటగాడు ఉవ్విళ్లూరుతున్నాడు. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సైతం టీ20లకు అందుబాటులోకి వచ్చాడు.సఫారీలతో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ. So Sanju Samson reached Cuttack. Today Kerala will be playing without Sanju Samson. This reminds me off 90s Indian team without Sachin. I don't think we will cross 100 without Sanju pic.twitter.com/tiuPi1TAj0— 𝗕𝗥𝗨𝗧𝗨 (@Brutu24) December 8, 2025 -
తొలి టీ20లో భారత్ ఘనవిజయం
-
తొలి టీ20లో భారత్ ఘనవిజయం
కటక్: శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ (4-23) మాయాజాలానికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లంకపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాట్స్‌మెన్‌లో ఉపుల్ తరంగ 23( 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు), కుశాల్ పెరీరా(19), డిక్వెల్లా(13), చమీరా(12)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వడంతో శ్రీలంక 87 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లలో చాహల్ (4), పాండ్యా(3), కుల్దీప్ యాదవ్(2) వికెట్లు తీయగా.. ఉనద్కత్ ఒక వికెట్ తీశాడు. రాహుల్ హాఫ్ సెంచరీ.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్ రోహిత్(17) నిరాశపర్చగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 61 (48 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సు) అర్ధ సెంచరీతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. మరో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 24(20 బంతులు, 3 ఫోర్లు).. చివర్లో ధోని 39(22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు), మనీష్ పాండే 32(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తొలి టీ20: శ్రీలంక లక్ష్యం 181
కటక్: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధశతకంతో మెరిశాడు. దీనికి తోడు యువ ఆటగాడు మనీష్ పాండే 32(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు), ధోని 39(22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు) తోడవ్వడంతో భారత్ 181 పరుగుల లక్ష్యాన్ని లంకకు నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మాథ్యూస్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటై ఓపెనర్ రోహిత్(17) తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చాలా రోజుల తర్వాత అవకాశం దక్కించుకున్న రాహుల్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సుతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోర్ 101 పరుగుల వద్ద ప్రదీప్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(24) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరికాసేపటికే రాహుల్ 61 (48 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సు) సైతం అవుటవ్వడంతో భారత్ స్కోర్ వేగం నెమ్మదించింది. ఈ పరిస్థితిల్లో ధోని, యువ ఆటగాడు మనీష్ పాండేలు వేగంగా ఆడే ప్రయత్నం చేశారు..కానీ లంక అద్బుత ఫీల్డింగ్‌తో పదే పదే బౌండరీలు ఆపడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. చివర్లో ప్రదీప్ వేసిన 19 ఓవర్ భారత్‌కు కలిసొచ్చింది. రెండు వైడ్లు ఒక నోబాల్ వేసి ప్రదీప్ మొత్తం 21 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో భారత్ 180 పరుగులు చేయగలిగింది. లంక బౌలర్లలో తిసారా పెరీరా, మాథ్యూస్, నువాన్ ప్రదీప్లకు తలో వికెట్ దక్కింది. -
రోహిత్ మరో ఘనత.!
కటక్: లంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 1500 పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపుపొందాడు. ఈ మ్యాచ్‌కు ముందు 15 పరుగుల దూరంలో ఉన్న రోహిత్ ధనుంజయ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని బౌండరీకి తరలించి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే మరో రెండు పరుగులు చేసిన రోహిత్(17) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ఇప్పటివరకు 69 మ్యాచ్‌లు ఆడిన ఈ డాషింగ్ ఓపెనర్ 130.04 స్ట్రైక్ రేటుతో ఒక సెంచరీ, 12 అర్ధశతకాలతో 1502 పరుగులు చేశాడు. అంతకు ముందు ఈ ఘనతను భారత కెప్టెన్ కోహ్లి సాధించగా.. తాజా మ్యాచ్‌తో రోహిత్ ఈ జాబితాలో చేరాడు. 55 టీ20లు ఆడిన కోహ్లి 137.84 స్ట్రైక్ రేటుతో 1956 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో రోహిత్ 14వ స్థానంలో ఉండగా కోహ్లి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మెకల్లమ్ (2140) ఉన్నాడు. -
మరో మైలురాయికి చేరువలో రోహిత్
కటక్: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయి ఎదుట నిలిచాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 1500 పరుగులు పూర్తి చేయడానికి 15 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు ఆడిన ఈ డాషింగ్ ఓపెనర్ 129.92 స్ట్రైక్ రేటుతో 1485 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 12 అర్ధశతకాలు ఉన్నాయి. 1500 పరుగులు పూర్తిచేస్తే విరాట్ కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించినవాడవుతాడు. 55 టీ20లు ఆడిన కోహ్లి 137.84 స్ట్రైక్ రేటుతో 1956 పరుగులు సాధించాడు. టీ20ల్లో కోహ్లి వ్యక్తిగత అత్యధిక సోరు 90 నాటౌట్. వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్న రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లోనూ చెలరేగుతాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కటక్‌లోని బరాబతి స్టేడియంలో ఈరోజు రాత్రి జరగనున్న మ్యాచ్‌లో శ్రీలంకతో రోహిత్ నేతృత్వంలోని టీమిండియా తలపడనుంది. లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్ సేన పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. -
సరదా కోసమే బాటిళ్లు విసిరారు: ధోనీ
కటక్ టి-20 మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ విఫలమైనందుకు స్టేడియంలోని ప్రేక్షకులు వాటర్ బాటిళ్లు విసిరి రచ్చ చేయడాన్ని మీడియా, క్రీడా రంగాలు తప్పుపట్టాయి. అయితే టీమిండియా కెప్టెన్ ధోనీ మాత్రం ఈ సంఘటనను తేలిగ్గా తీసుకున్నాడు. కటక్‌లో ప్రేక్షకుల తీరు వల్ల ఆటగాళ్ల భద్రతకు హానీ కలగలేదని, ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకోరాదని అన్నాడు. సరదా కోసమే ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరారంటూ తేలికపరిచే ప్రయత్నం చేశాడు. గతంలో వైజాగ్‌లో ఓ మ్యాచ్‌ను అలవోకగా గెలిచినప్పుడు కూడా ప్రేక్షకులు ఇలాగే బాటిళ్లు విసిరారని ధోనీ చెప్పాడు. సరదా కోసమే ఇలా చేశారని, ఇలాంటి ఘటనలను సీరియస్ గా పరిగణించరాదని అన్నాడు. దక్షిణాఫ్రికాతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 92 పరుగులకు ఆలౌట్ కావడంతో ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరి అంతరాయం కలిగించారు.


