మరో మైలురాయికి చేరువలో...

Rohit Sharma 15 Runs Away From Joining 1500 runs Club in T20s - Sakshi

కటక్‌‌: టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో మైలురాయి ఎదుట నిలిచాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 1500 పరుగులు పూర్తి చేయడానికి 15 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు ఆడిన ఈ డాషింగ్‌ ఓపెనర్‌ 129.92 స్ట్రైక్‌ రేటుతో 1485 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 12 అర్ధశతకాలు ఉన్నాయి.

1500 పరుగులు పూర్తిచేస్తే విరాట్‌ కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించినవాడవుతాడు. 55 టీ20లు ఆడిన కోహ్లి 137.84 స్ట్రైక్‌ రేటుతో 1956 పరుగులు సాధించాడు. టీ20ల్లో కోహ్లి వ్యక్తిగత అత్యధిక సోరు 90 నాటౌట్. వన్డేల్లో అత్యధిక డబుల్‌ సెంచరీలు సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్న రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్‌లోనూ చెలరేగుతాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కటక్‌లోని బరాబతి స్టేడియంలో ఈరోజు రాత్రి జరగనున్న మ్యాచ్‌లో శ్రీలంకతో రోహిత్‌ నేతృత్వంలోని టీమిండియా తలపడనుంది. లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్‌ సేన పొట్టి ఫార్మాట్‌లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top