యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చూవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2 తేడాతో స్టోక్స్ సేన వెనకబడింది.
తొలి టెస్టుతో పోలిస్తే బ్రిస్బేన్‌లో బ్యాటింగ్ పరంగా ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఆసీస్ బ్యాటర్లను ఇంగ్లీష్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ విమర్శల వర్షం కురిపించారు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన కనబరుస్తుందని, తిరిగి కమ్‌బ్యాక్ చేయాలంటే అద్భుతం జరిగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
"బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన కనబరించింది. ఈ చెత్త బ్యాటింగ్, బౌలింగ్‌తో వారు యాషెస్ ట్రోఫీ కాదు కదా, పైన ఉన్న కప్పును కూడా గెలవలేరు. ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ చెత్తగా ఉంది. పదే పదే షార్ట్ పిచ్ బంతులు వేయడం, ఎక్కువగా వైడ్ వేసి భారీగా పరగులు సమర్పించుకున్నారు.
అంతేకాకుండా బ్రిస్బేన్‌లో క్యాచ్‌లు కూడా జారవిడిచారు. నాలుగేళ్లగా ఆస్ట్రేలియాను ఓడించిడానికి ఇంగ్లండ్ ఒక బ్లూప్రింట్ సిద్ధం చేసింది. అయినప్పటికి కంగారులపై పై చేయి సాధించలేకపోతున్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌లు ఎవరూ మాట వినరు.
తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారు. టెస్ట్ క్రికెట్ గురించి తమకు మాత్రమే తెలుసు అని వాళ్లు అనుకుంటున్నారు. ప్రతీసారి దూకుడుగా ఆడాలని కెప్టెన్ చెబుతుంటాడు. టెస్టు క్రికెట్ అంటే దూకుడుగా ఆడడం కాదు.. ఓపిక, సహనం రెండూ ఉండాలి.
కానీ మా జట్టులో అది కన్పించడం లేదు. బాజ్ బాల్ అట్టర్ ప్లాప్ అయ్యింది. హ్యారీ బ్రూక్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. అదేవిధంగా ఓలీ పోప్ సైతం తన వికెట్‌ను ఈజీగా సమర్పించుకుంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్ తిరిగి కోలుకోవడం కష్టమే" అని బాయ్‌కాట్ పేర్కొన్నారు.
చదవండి: IPL 2026: యువ సంచలనంపై ముంబై కన్ను.. ఎవరీ ముకుల్ చౌదరి?


