యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. 65 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. అయితే నాలుగో రోజు ఆట సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. హెడ్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన స్మిత్ మ్యాచ్‌ను త్వరగా ముగించేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసిన ఆర్చర్.. తొలి బంతిని స్మిత్‌కు 146.6 వేగంతో గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్మిత్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత బంతిని స్మిత్‌కు 149.5 కి.మీ వేగంతో వేశాడు. ఆ బంతిని స్టీవ్ అప్పర్ కట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
వెంటనే అర్చర్ స్మిత్ వద్దకు వెళ్లి టార్గెట్ తక్కువగా ఉన్నా అంత దూకుడుగా ఎందుకు ఆడుతున్నావు? "ఓడిపోతాము అని తెలిసినప్పుడు నువ్వెందుకు అంత వేగంగా బౌలింగ్ చేస్తున్నావు ఛాంపియన్ అంటూ స్మిత్ అంటూ బదులిచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. యాషెస్ సిరీస్ అంటే ఏ మాత్రం ఫైర్ ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇరు జట్లు మధ్య మూడో టెస్టు అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs SA: కోహ్లి, రోహిత్‌లకు షాకిచ్చిన గౌతమ్ గంభీర్!
"Bowl fast when there's nothing going on champion."
Steve Smith v Jofra Archer was seriously spicy 🍿 #Ashes pic.twitter.com/jfa4PiZyb2— cricket.com.au (@cricketcomau) December 7, 2025


