బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ వన్ సైడెడ్‌గా సాగుతోంది. మరోసారి ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి టెస్ట్‌లో బంపర్ విక్టరీ సాధించిన ఆసీస్ మరోసారి అదే స్థాయి గెలుపు దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి ఓటమి అంచుల్లో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గట్టెక్కడం అసంభవం. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. ఇన్నింగ్స్ పరాభవం తప్పించుకోవాలంటే ఇంగ్లండ్ మిగిలిన 4 వికెట్లు కోల్పోకముందే ఈ పరుగులు చేయాలి. బెన్ స్టోక్స్ (4), విల్ జాక్స్ (4) క్రీజ్‌లో ఉన్నారు.
ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, మైఖేల్ నెసర్, స్కాట్ బోలాండ్ తలో 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే 44, డకెట్ 15, పోప్ 26, రూట్ 15, బ్రూక్ 15, జేమీ స్మిత్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. వీరందరికీ మంచి ఆరంభమే లభించినప్పటికీ.. ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు.
అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో 11 మంది తలో చేయి వేసి ఈ స్కోర్ వచ్చేలా చేశారు. స్పెషలిస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ (77) బ్యాట్‌తోనూ చెలరేగి టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.
స్టార్క్‌తో పాటు మరో నలుగురు కూడా అర్ద సెంచరీలు చేశారు. జేక్ వెదరాల్డ్ 72, లబూషేన్ 65, స్టీవ్ స్మిత్ 61, అలెక్స్ క్యారీ 63 పరుగులు చేశారు.
ట్రవిస్ హెడ్ (33), గ్రీన్ (45) కూడా పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో ఇంగ్లిస్ 23, నెసర్ 16, బోలాండ్ 21 (నాటౌట్), డాగెట్ 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 4 వికెట్లతో సత్తా చాటగా.. స్టోక్స్ 3, ఆర్చర్, అట్కిన్సన్, జాక్స్ తలో వికెట్ తీశారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జో రూట్(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో 334 పరుగులు చేసింది. జాక్ క్రాలీ(76),ఆర్చర్(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.


