ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. యాషెస్ రెండో టెస్ట్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. లబూషేన్ ఖాతాలో ఉన్న ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం లబూషేన్ ఖాతాలో 4350 పరుగులు ఉండగా.. స్టీవ్ ఖాతాలో 4358 పరుగులు ఉన్నాయి. ఓవరాల్‌గా డబ్ల్యూటీసీ అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ పేరిట ఉంది. ప్రస్తుతం రూట్ ఖాతాలో 6226 పరుగులు ఉన్నాయి. రూట్‌కు రెండో స్థానంలో ఉన్న స్టీవ్‌కు మధ్య దాదాపు 2000 పరుగుల వ్యత్యాసం ఉండటం విశేషం.
హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్ట్ హోరాహోరీగా సాగుతోంది. రెండో రోజు ఆటలో ఇంగ్లీష్ జట్టుపై కంగారులు పైచేయి సాధించారు. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసి, 44 పరుగుల ఆధిక్యంలో ఉంది.
క్రీజులో అలెక్స్ కారీ (46), నీసర్ (15) ఉన్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో జేక్ వెదరాల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65), స్టీవ్ స్మిత్ (61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ట్రావిస్ హెడ్ 33 పరుగులకే పరిమితయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, స్టోక్స్ 2, ఆర్చర్ ఓ వికెట్ తీశారు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. జో రూట్(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.


