వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. పర్యాటక ప్రోటీస్ జట్టును 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో రాహుల్ సేన సొంతం చేసుకుంది.
జైశ్వాల్ సెంచరీ..
లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 75 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్‌ను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్‌కు పంపాడు. కానీ జైశ్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.
ప్రత్యర్ధి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను జైశ్వాల్ అందుకున్నాడు. ఈ ముంబై ఆటగాడు 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 పరుగులు చేసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్‌ఒక్కడే వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
Look at what it means to him! 🥳
What a special knock this has been from Yashasvi Jaiswal 🙌
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/BHyNjwOGWY— BCCI (@BCCI) December 6, 2025
డికాక్ సెంచరీ వృథా..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో డికాక్ సెంచరీ వృథా అయిపోయింది.

Virat Kohli in this series :
Innings -3
Runs - 302
Avg. - 151
SR - 117.05
100s- 2
50s-1
Should get Man of the Series.#ViratKohli𓃵 pic.twitter.com/NVeNDgTqU2— Pedriverse (@Cules651) December 6, 2025
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్


