సౌతాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో విఫలమైన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. వైజాగ్ వేదికగా జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో జైశ్వాల్ సెంచరీతో చెలరేగాడు.
271 పరుగుల లక్ష్య చేధనలో జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన యశస్వి.. క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. జైశూ 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో తన వన్డే సెంచరీ మార్క్ అందుకున్నాడు. శతక్కొట్టగానే జైశ్వాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గాల్లోకి జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
కాగా మొదటి రెండు వన్డేల్లో ఈ ముంబై ఆటగాడు విఫలం కావడంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం జైశ్వాల్‌పై నమ్మకం ఉంచాడు. దీంతో తనకు లభించిన అవకాశాన్ని జైశ్వాల్ అందిపుచ్చుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడడంతో జైశ్వాల్‌కు జట్టులో చోటుదక్కింది. మళ్లీ గిల్ తిరిగొస్తే జైశ్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గానే కొనసాగనున్నాడు.
ఇక వైజాగ్ వన్డేలో టీమిండియా విజయానికి చేరువైంది. సిరీస్ విజయానికి భారత్‌కు ఇంకా 29 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి(46), జైశ్వాల్(107) ఉన్నారు.
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్


