ఇద్దరి మధ్య 8 పాయింట్లే అంతరం
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ టాప్–2లో భారత స్టార్లు
దుబాయ్: ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డేసిరీస్‌లో దంచికొట్టిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్‌సెంచరీతో 302 పరుగులు చేసిన 37 ఏళ్ల కోహ్లి... తాజా ర్యాంకింగ్స్‌లో 773 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరాడు. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ 781 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ ఇద్దరి మధ్య 8 పాయింట్ల అంతరమే ఉంది. గాయం కారణంగా సఫారీలతో సిరీస్‌కు దూరమైన శుబ్‌మన్ గిల్ (723 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో ఉండగా... కేఎల్ రాహుల్ (649 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 12వ ర్యాంక్‌లో నిలిచాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ (655 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌లో నిలిచాడు.
అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (710 పాయింట్లు) ‘టాప్’లో కొనసాగుతున్నాడు. టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ (913 పాయింట్లు), బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి (782 పాయింట్లు) అగ్రస్థానాల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (879 పాయింట్లు) ‘టాప్’లో ఉండగా... యాషెస్ సిరీస్‌లో విజృంభిస్తున్న మిచెల్ స్టార్క్ (852 పాయింట్లు) మూడో స్థానాలు మెరుగు పరుచుకొని మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.


