తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
జొమాటో, స్విగ్గీ, పేటీఎంకూ చోటు
న్యూఢిల్లీ: మీడియా ప్రచారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రారాజుగా నిలుస్తోంది. దేశీ మీడియాలో ఎక్కువగా కనిపించే లిస్టెడ్ కంపెనీగా విజికీ న్యూస్‌మేకర్ ఇండెక్స్‌లో వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నట్టు విజికీ న్యూస్‌మేకర్ ర్యాంకింగ్స్ 2025 ప్రకటించింది. సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్తల స్కోరు 2021లో 84.9గా ఉంటే, 2022లో 92.56, 2023లో 96.46, 2024లో 97.43, 2025లో 97.83కు క్రమంగా పెరుగుతూ వచ్చింది.
అంటే మీడియా ప్రచారంలో రిలయన్స్ క్రమంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నట్టు ఈ డేటా తెలియజేస్తోంది. ఏఐ, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా, మీడియా అనలైటిక్స్ ద్వారా 4 లక్షలకు పైగా ప్రచురణల్లో బ్రాండ్‌కు ఉన్న ప్రచారం, గుర్తింపును విజికీ న్యూస్‌మేకర్ ర్యాంకింగ్స్ విశ్లేíÙస్తుంటుంది. ప్రభుత్వరంగ అగ్రగామి బ్యాంక్ ఎస్‌బీఐ 92.81 స్కోరుతో రెండో స్థానంలో ఉంటే, 88.41 స్కోరుతో హెచ్‌డీఎఫ్‌సీ మూడో స్థానంలో నిలిచింది.
భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, ఐటీసీ టాప్–10లో ఉన్నాయి. జొమాటో 11, స్విగ్గీ 12, వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) 13వ ర్యాంక్ దక్కించుకున్నాయి. బ్రాండ్ వారీ వార్తల పరిమాణం, ప్రముఖ వార్తల్లో వాటికి దక్కిన స్థానం, ఆయా ప్రచురణలకు ఉన్న విస్తరణ, రీడర్లు ఆధారంగా 0 నుంచి 100 వరకు స్కోర్‌ను విజికీ న్యూస్‌మేకర్స్ ర్యాంకింగ్స్ కేటాయించింది. నాలుగు లక్షలకు పైగా ప్రచురణల్లో ఒక్కో బ్రాండ్‌కు సంబంధించి ఎన్ని వార్తలు వచ్చాయి, ఏ బ్రాండ్‌కు తరచూ ప్రచారం లభిస్తోందన్న అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది.


