మెజారిటీ వాటా కొనుగోలు
చెన్నై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ తాజాగా తమిళనాడు సంస్థ ఉదయమ్స్‌లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. అయితే వాటా కొనుగోలు విలువ వెల్లడికాలేదు.
ఒప్పందం ప్రకారం ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెలో గత ప్రమోటర్లు ఎస్.సుధాకర్, ఎస్.దినకర్ మైనారిటీ వాటాతో కొనసాగనున్నారు. ఉదయమ్ బ్రాండుతో మూడు దశాబ్దాలుగా తమిళనాడు మార్కెట్లో కంపెనీ పటిష్ట కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పంపిణీ నెట్‌వర్క్ ద్వారా బియ్యం, మసాలా దినుసులు, ఇడ్లీ నూక, స్నాక్స్ తదితర నిత్యావసరాలు విక్రయిస్తోంది.


