కైనెటిక్‌ టెక్నాలజీస్‌లో సైయెంట్‌  | Cyient acquires majority stake in Kinetic Technologies | Sakshi
Sakshi News home page

కైనెటిక్‌ టెక్నాలజీస్‌లో సైయెంట్‌ 

Dec 19 2025 3:54 AM | Updated on Dec 19 2025 7:56 AM

Cyient acquires majority stake in Kinetic Technologies

సెమీకండక్టర్స్‌కి మెజారిటీ వాటాలు 

రూ. 840 కోట్ల  డీల్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పవర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ కైనెటిక్‌ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనున్నట్లు సైయెంట్‌ సెమీకండక్టర్స్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. 

ఈ డీల్‌ విలువ 93 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 840 కోట్లు). 40 బిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే పవర్‌ సెమీకండక్టర్ల మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని సీఈవో సుమన్‌ నారాయణ్‌ తెలిపారు. అలాగే డేటా సెంటర్లు, ఎలక్ట్రిఫికేషన్, ఆటోమోటివ్, నెట్‌వర్కింగ్‌ తదితర విభాగాల్లో విస్తరించేందుకు తోడ్పడనుందన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement