హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గురువారం ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ)ని సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంక్‌డాట్‌ఇన్ డొమైన్‌కి బ్యాంకుల మై గ్రేషన్, బ్యాంకింగ్‌కి పొంచి ఉన్న రిస్కులను గుర్తించేందుకు ఉద్దేశించిన సచేత్ ప్లాట్‌ఫాంలో ఏఐ వినియోగం తదితర అంశాల గురించి ఐడీఆర్‌బీటీ అధికారులు ఆయనకు వివరించారు.
బ్యాంకింగ్ రంగం కోసం ఐటీ మౌలిక సదుపాయాలను రూపొందించడంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తుండటాన్ని మల్హోత్రా ప్రశంసించారు. టెక్నాలజీ, బ్యాంకింగ్‌కి అనుగుణంగా పరిశ్రమ అవసరాలకు తగ్గ సొల్యూషన్స్‌ని రూపొందించడంపై దృష్టి పెట్టాల న్నారు. డిజిటల్ బ్యాంకింగ్‌పై ప్రజల్లో నమ్మకం కలిగించేలా వ్యూహాన్ని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.


