అంబానీ సామ్రాజ్యం స్థిరం | Reliance Industries Net profit rises to Rs 18,645 crore Q3 Results | Sakshi
Sakshi News home page

అంబానీ సామ్రాజ్యం స్థిరం

Jan 17 2026 4:02 AM | Updated on Jan 17 2026 4:02 AM

Reliance Industries Net profit rises to Rs 18,645 crore Q3 Results

క్యూ3లో రిలయన్స్‌ మిక్స్‌డ్‌ ఫ్లేవర్‌

జియో జోరు, రిటైల్‌ రికార్డులు

ప్రాఫిట్‌ రూ. 18,645 కోట్లు 

ఆదాయం రూ. 2.69 లక్షల కోట్లు 

రూ. 221కు జియో ఏఆర్‌పీయూ 

కొత్తగా 431 రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లు

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఫ్లాట్‌గా రూ. 18,645 కోట్లను తాకింది. ఇతర విభాగాలు పుంజుకున్నప్పటికీ గ్యాస్‌ ఉత్పత్తి క్షీణించడం, రిటైల్‌ బిజినెస్‌ నీరసించడం ప్రభావం చూపాయి. 

గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 18,540 కోట్లు ఆర్జించింది. కన్జూమర్‌ బిజినెస్‌ విడదీత, జీఎస్‌టీ క్రమబదీ్ధకరణ నేపథ్యంలో రిటైల్‌ బిజినెస్‌ ఆర్జన మందగించగా.. ఎనర్జీ, డిజిటల్‌ విభాగాలు మెరుగైన మార్జిన్లు సాధించాయి. కాగా.. మొత్తం ఆదాయం రూ. 2.43 లక్షల కోట్ల నుంచి రూ. 2.69 లక్షల కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం(ఇబిటా) 6 శాతం వృద్ధితో రూ. 48,003 కోట్లకు చేరింది. 

విభాగాల వారీగా 
రిలయన్స్‌ రిటైల్‌ నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 3,551 కోట్లను తాకింది. కొత్తగా 431 స్టోర్లను ప్రారంభించింది. ఆదాయం 8 శాతం ఎగసి రూ. 97,605 కోట్లకు చేరింది. జియో ప్లాట్‌ఫామ్స్‌ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 7,629 కోట్లకు చేరింది. త్రైమాసికవారీగా కస్టమర్ల సంఖ్య 50.64 కోట్ల నుంచి 51.53 కోట్లకు పెరిగింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 213.7 నుంచి రూ. 221.4కు బలపడింది. కేజీ ఫీల్డ్స్‌లో ఉత్పత్తి తగ్గడంతో ఇబిటా 13 శాతం క్షీణించి రూ. 4,857 కోట్లకు పరిమితమైంది.

 కేజీడీ6లో సగటున గ్యాస్‌ ఉత్పత్తి 26.1 ఎంఎస్‌సీఎండీకి చేరగా.. రోజుకి 18,400 బ్యారళ్ల చమురును వెలికితీసింది. జియోస్టార్‌ రూ. 8,010 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 1,303 కోట్లుకాగా.. యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 13 శాతం వృద్ధితో నెలవారీ 45 కోట్లను తాకింది. 2025 డిసెంబర్‌31కల్లా ఆర్‌ఐఎల్‌ నికర రుణ భారం రూ. 1.17 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో రూ. 33,286 కోట్ల పెట్టుబడి వ్యయాలను కవర్‌ చేసేలా రూ. 41,303 కోట్ల నగదు ఆర్జన సాధించింది. ఆర్‌ఐఎల్‌ షేరు ఫ్లాట్‌గా రూ.1,458 వద్ద ముగిసింది.

ఓ2సీ, న్యూ ఎనర్జీపై దృష్టి
ఓ2సీ, న్యూ ఎనర్జీ బిజినెస్‌లలో వృద్ధికి వీలుగా ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులపై పెట్టుబడులను వెచి్చస్తున్నాం. అంతేకాకుండా జియో, రిటైల్‌ నెట్‌వర్క్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విస్తరణ, పటిష్టతలకు పెట్టుబడి వ్యయాలను కేటాయిస్తున్నాం. వివిధ విభాగాలలో నిలకడైన ఆర్థిక పనితీరు, నిర్వహణ సామర్థ్యాలను తాజా ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి.   
– ముకేశ్‌ డి.అంబానీ, చైర్మన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement