బ్యాంకులకు లాభాల కళ | Public sector banks post 18percent growth in profit to record Rs 52,603 cr in q3 | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు లాభాల కళ

Feb 10 2026 5:42 AM | Updated on Feb 10 2026 7:33 AM

Public sector banks post 18percent growth in profit to record Rs 52,603 cr in q3

డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.52,603 కోట్లు 

18 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభాల మోత మోగించాయి. ఎస్‌బీఐ సహా 12 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉమ్మడిగా రూ.52,603 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.44,473 కోట్లతో పోల్చి చూస్తే 18 శాతం మేర (రూ.8,130 కోట్లు) పెంచుకున్నాయి. 

→ అన్నింటిలోకి ఎస్‌బీఐ వాటా అధికంగా ఉంది. డిసెంబర్‌ త్రైమాసికం (క్యూ3)లో ఎస్‌బీఐ రూ.21,028 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చతే 24 శాతం పెరిగింది. 

→ చెన్నై కేంద్రంగా పనిచేసే ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 35 శాతం అధికంగా రూ.1,365 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 

→ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం 32 శాతం పెరిగి రూ.1,263 కోట్లుగా ఉంది. 

→ లాభంలో అధిక వృద్ధిని చూపించిన వాటిల్లో ఎస్‌బీఐతోపాటు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (27 శాతం), కెనరా బ్యాంక్‌ (26 శాతం) ఉన్నాయి. 

→ పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ (19 శాతం) యూకో బ్యాంక్‌ (16 శాతం), పీఎన్‌బీ 13 శాతం చొప్పున లాభాన్ని డిసెంబర్‌ త్రైమాసికంలో పెంచుకున్నాయి.  

→ 12 ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ఉమ్మడి లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 11 శాతం పెరిగి రూ.44,218 కోట్లుగా ఉంది. సెపె్టంబర్‌ త్రైమాసికంలో 9 శాతం తక్కువగా రూ.49,456 కోట్లుగా ఉండడం గమనించొచ్చు. 

→ ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ చివరి వరకు తొమ్మిది నెలల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం రూ.1,46,277 కోట్లకు చేరింది. అంక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.1,29,994 కోట్లుగా ఉంది. 

→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పీఎస్‌బీల లాభం రూ.2లక్షల కోట్లను అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు వ్యక్తం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement