రూ. 128 కోట్లకు పరిమితమైన క్యూ3 లాభాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. బ్యాంక్ నికర లాభం 90 శాతం క్షీణించి రూ. 128 కోట్లకు పరిమితమైంది. కొత్త యాజమాన్య నిర్వహణలో లోన్ బుక్ వెనకడుగు వేయడం, మైక్రోఫైనాన్స్ బుక్‌లో క్షీణత ప్రభావం చూపాయి.
గత క్యూ3లో బ్యాంక్ లాభం రూ. 1,402 కోట్లుగా నమోదైంది. తాజాగా.. నికర వడ్డీ ఆదాయం 13% నీరసించి రూ. 4,562 కోట్లకు చేరింది. స్లిప్పేజీలు రూ. 2,200 కోట్ల నుంచి రూ. 2,560 కోట్లకు పెరిగాయి. వీటిలో మైక్రో రుణాల వాటా రూ. 1,022 కోట్లుకాగా.. మైక్రో లోన్‌బుక్ 46% క్షీణించి రూ. 17,669 కోట్లకు పరిమితమైంది. స్థూల మొండిబకాయిలు 2.25% నుంచి 3.56 శాతానికి పెరిగాయి.
బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 1 శాతం నష్టంతో రూ. 893 వద్ద ముగిసింది.


