మెప్పించని వినోదం  | ZEE Entertainment Net profit falls 5percent YoY to Rs155. 3 crore in Q3 results | Sakshi
Sakshi News home page

మెప్పించని వినోదం 

Jan 23 2026 5:09 AM | Updated on Jan 23 2026 5:09 AM

ZEE Entertainment Net profit falls 5percent YoY to Rs155. 3 crore in Q3 results

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లాభం డీలా 

క్యూ3లో రూ. 155 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌(జీల్‌) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 155 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 164 కోట్లు ఆర్జించింది. నిర్వహణ ఆదాయం మాత్రం 15 శాతం బలపడి రూ. 2,299 కోట్లకు చేరింది. సబ్‌్రస్కిప్షన్‌సహా ఇతర అమ్మకాలు, సర్వీసులు ఇందుకు దోహదపడ్డాయి. 

మూవీ హక్కులు కొనుగోలు చేయడం, ఐఎల్‌ టీ20 లీగ్‌ మ్యాచ్‌లలో మార్పులు, కొత్త కంటెంట్‌ను ప్రవేశపెట్టడం తదితరాల నేపథ్యంలో నిర్వహణ వ్యయాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. వెరసి మొత్తం వ్యయాలు 20 శాతంపైగా పెరిగి రూ. 2,087 కోట్లను దాటాయి. ఈ కాలంలో సబ్‌్రస్కిప్షన్‌ నుంచి 7 శాతం అధికంగా రూ. 1,050 కోట్ల ఆదాయం సాధించగా.. ప్రకటనల నుంచి 9 శాతం తక్కువగా రూ. 852 కోట్లు అందుకుంది. ఇతర అమ్మకాలు, సర్విసుల నుంచి ఆదాయం ఆరు రెట్లు ఎగసి రూ. 378 కోట్లను అధిగమించింది. 

జీల్‌ షేరు బీఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement