అరబిందో ఫార్మా లాభం ప్లస్‌ | Aurobindo Pharma Q3 net up 7. 6percent to Rs 910 cr | Sakshi
Sakshi News home page

అరబిందో ఫార్మా లాభం ప్లస్‌

Feb 10 2026 5:51 AM | Updated on Feb 10 2026 7:33 AM

Aurobindo Pharma Q3 net up 7. 6percent to Rs 910 cr

క్యూ3లో రూ. 910 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 8 శాతం ఎగసి రూ. 910 కోట్లను తాకింది. యూరప్, యూఎస్‌లలో అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో హైదరాబాద్‌ కంపెనీ రూ. 846 కోట్లు ఆర్జించింది.

 మొత్తం ఆదాయం సైతం రూ. 7,979 కోట్ల నుంచి రూ. 8,646 కోట్లకు బలపడింది. ప్రధాన బిజినెస్‌లలో పటిష్ట ఎగ్జిక్యూషన్, నిలకడైన డిమాండ్, యూఎస్, యూరప్‌ తదితర కీలక మార్కెట్లలో విస్తరించిన బలమైన డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియో వంటి అంశాలు క్యూ3 ఫలితాలను ప్రతిబింబిస్తున్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి పేర్కొన్నారు. 

ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 1 శాతం లాభంతో రూ. 1,201 వద్ద ముగిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement