ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు.. ఈ విభాగంలో కూడా తమ హవా కొనసాగించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో హానర్, ఒప్పో ముందు వరుసలో ఉన్నాయి. ఈ సంస్థల తరువాత షియోమి కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. కాగా వివో కూడా X ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించనుంది.
వివో లాంచ్ చేయనున్న X ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ 200-మెగాపిక్సెల్ కెమెరా & మల్టీ-స్పెక్ట్రల్ సెన్సార్‌తో రానుంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఇది బెస్ట్ కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది. కాగా కంపెనీ దీనికి సంబంధించిన చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది.
వివో X ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొదట దీనిని చైనా మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేయనున్నారు. కాగా దీని ధరలు, లాంచ్ డేట్ వంటివి తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా త్వరలోనే తెలుస్తాయి.


