భాతర స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్ వివో తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లలో (రవాణా) 18.3 శాతం వాటాతో వివో మొదటి స్థానాన్ని కాపాడుకుంది. ఒప్పో 13.9 శాతం, శామ్‌సంగ్ 12.6 శాతం, యాపిల్ 10.4 శాతం, రియల్‌మీ 9.8 శాతం, షావోమీ 9.2 శాతం చొప్పున మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి.
వన్‌ప్లస్ షిప్‌మెంట్‌లు ఇదే కాలంలో 30.5 శాతం తగ్గాయి. మోటరోలా 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. మారెŠక్‌ట్ పరిశోధనా సంస్థ ఐడీసీ డేటా ప్రకారం.. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 4.8 శాతం వృద్ధితో 4.8 కోట్ల యూనిట్లకు చేరుకుంది. యాపిల్ సంస్థ 50 లక్షల ఐఫోన్లను రవాణా చేసింది.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో 43.3 శాతం వృద్ధి నమోదైంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల వాటా మొత్తం ఫోన్లలో 4 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. ఇందులో 70 శాతం ఐఫోన్ 16, 15, 17 మోడళ్లున్నాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో 66 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ టాప్‌లో ఉంది. శామ్‌సంగ్ 31 శాతం వాటాతో తర్వాతి స్థానంలో నిలిచింది.


