కొత్త ఏడాదిలో.. ఫిన్‌టెక్‌ ఐపీవోల జోరు  | Public issue new year fintech companies listing in india | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలో.. ఫిన్‌టెక్‌ ఐపీవోల జోరు 

Dec 28 2025 4:26 AM | Updated on Dec 28 2025 5:37 PM

Public issue new year fintech companies listing in india

జాబితాలో 10 పైగా అంకురాలు 

లిస్టింగ్‌ బాటలో ఫోన్‌పే, రేజర్‌పే, పేయూ 

రూ. 1,450 కోట్ల సమీకరణలో అయ్‌ ఫైనాన్స్‌ 

భారీ ఇష్యూగా నిలవనున్న ఫోన్‌పే

వచ్చే ఏడాది కూడా పబ్లిక్‌ ఇష్యూల జోరు కొనసాగనుంది. కొత్త సంవత్సరంలో సుమారు పది దిగ్గజ ఫిన్‌టెక్‌ కంపెనీలు సైతం లిస్టింగ్‌పై కసరత్తు చేస్తున్నాయి. ఫోన్‌పే, రేజర్‌పే, పేయూ, అయ్‌ ఫైనాన్స్, ఇన్‌క్రెడ్‌ హోల్డింగ్స్, ఇన్నోవిటీ, పేనియర్‌బై తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు ఇన్సూరెన్స్‌ ప్లాట్‌ఫాంలు ఎకో, టరి్టల్‌మింట్, ట్రావెల్‌ బ్యాంకింగ్‌ సంస్థ నియోలాంటివి కూడా ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని కంపెనీలు ఇప్పటికే ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచగా, మరికొన్ని సంస్థలు బ్యాంకర్లను నియమించుకునే పనిలో ఉన్నాయి.

 ఇంకొన్ని తమ లిస్టింగ్‌ ప్రణాళికలను ప్రకటించాయి. అయ్‌ ఫైనాన్స్, టరి్టల్‌మింట్‌ సంస్థలకు నియంత్రణ సంస్థ అనుమతి కూడా లభించింది. అయ్‌ ఫైనాన్స్‌ దాదాపు రూ. 1,450 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 885 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో మరిన్ని షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఇక రుణాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు సాగించే ఇన్‌క్రెడ్‌ హోల్డింగ్స్‌ కూడా తమ ఐపీవో పత్రాలను సెబీకి సమరి్పంచింది. వీటి ప్రకారం కంపెనీ దాదాపు రూ. 3,000–4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

ఫోన్‌పే కూడా ముసాయిదా పత్రాలను నియంత్రణ సంస్థకు సమరి్పంచినట్లు సెపె్టంబర్‌లో ప్రకటించింది. డీల్‌ వివరాలను వెల్లడించనప్పటికీ, దాదాపు రూ. 12,000 కోట్లు సమీకరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది రాబోయే అతి పెద్ద ఐపీవోల్లో ఇది కూడా ఒకటి కానుంది.

 దీనితో టైగర్‌ గ్లోబల్, జనరల్‌ అట్లాంటిక్, రిబిట్‌ క్యాపిటల్, టీవీఎస్‌ క్యాపిటల్‌లాంటి ప్రారంభ దశ ఇన్వెస్టర్లు ని్రష్కమించేందుకు అవకాశం లభిస్తుంది. అటు ఇన్నోవిటి, పేయూ, పేనియర్‌బై, నియో సంస్థల మేనేజ్‌మెంట్లు కూడా తమ లిస్టింగ్‌ ప్రణాళికలను ధృవీకరించాయి. అయితే, ఇంకా ముసాయిదా పత్రాలను సమరి్పంచాల్సి ఉంది. ఎకో సంస్థ 2026–27లో లిస్టింగ్‌ ద్వారా 300–400 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 2,700 కోట్లు – రూ. 3,600 కోట్ల వరకు) సమీకరించే దిశగా బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  

స్టార్టప్‌లలో పెట్టుబడుల వెల్లువ .. 
గత రెండేళ్లుగా అంకుర సంస్థల్లోకి స్థిరంగా పెట్టుబడులు వస్తున్నాయ. అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న సంస్థల్లో ఈ–కామర్స్‌ తర్వాత ఫిన్‌టెక్‌ కంపెనీలు రెండో స్థానంలో ఉన్నాయ. పరిశ్రమ డేటా ప్రకారం 2025లో ఫిన్‌టెక్‌ కంపెనీలు 120 డీల్స్‌ ద్వారా 1.87 బిలియన్‌ డాలర్ల పైగా నిధులను సమీకరించాయి. 2024లో 140 డీల్స్‌ ద్వారా 1.61 బిలియన్‌ డాలర్లు సేకరించాయి. 

వ్యాపారాన్ని విస్తరిస్తూ, నష్టాలను తగ్గించుకుంటూ ఉండటం ద్వారా పలు ఫిన్‌టెక్‌ కంపెనీలు క్రమంగా లాభాల బాట పడుతున్నాయి. దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికలు వేసుకుంటున్నాయి. 

ఈ నేపథ్యంలో గ్రో, పైన్‌ ల్యాబ్స్, మొబిక్విక్‌లాంటి కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి సానుకూల స్పందన లభించింది. దీంతో మరిన్ని కంపెనీలు కూడా లిస్టింగ్‌ బాట పడుతున్నాయి. ఇక ఫిన్‌టెక్‌లే కాకుండా 2026లో వివిధ విభాగాలకు చెందిన అంకురాలు కూడా పబ్లిక్‌ ఇష్యూకి రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, ఓయో, రెంటోమోజో, బోట్, క్యూర్‌ఫుడ్స్, జెట్‌వెర్క్, షిప్‌రాకెట్, షాడోఫ్యాక్స్‌ మొదలైనవి ఈ లిస్టులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement