పబ్లిక్ ఇష్యూలకి సెబీ ఓకే
లిస్టులో పర్పుల్ స్టయిల్ ల్యాబ్స్, సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్
రూ. 5,500 కోట్ల వరకు సమీకరించనున్న ఇన్‌ఫ్రా.మార్కెట్
న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రా.మార్కెట్ మాతృ సంస్థ హెల్లా ఇన్‌ఫ్రా మార్కెట్, పర్పుల్ స్టయిల్ ల్యాబ్స్ సహా 12 కంపెనీల ప్రతిపాదిత ఐపీవోలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో జై జగదంబ లిమిటెడ్, యూకేబీ ఎల్రక్టానిక్స్, సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, ట్రాన్స్‌లైన్ టెక్నాలజీస్, మెడిక్యాప్ హెల్త్‌కేర్, ఓస్వాల్ కేబుల్స్, బీవీజీ ఇండియా, సాయి పేరెంటరల్స్, కామ్టెల్ నెట్‌వర్క్స్, సిఫీ ఇని్ఫనిట్ స్పేసెస్ ఉన్నాయి. గతేడాది జూన్–అక్టోబర్ మధ్య ఈ 12 కంపెనీలు తమ ముసాయిదా ఐపీవో పత్రాలను సెబీకి దాఖలు చేశాయి. వివరాలు..
→ నిర్మాణ రంగ మెటీరియల్స్ సరఫరా కంపెనీ ఇన్‌ఫ్రా.మార్కెట్ ప్రతిపాదిత ఐపీవో ద్వారా రూ. 4,500 కోట్ల నుంచి రూ. 5,550 కోట్ల వరకు సమీకరించనుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాన్ఫిడెన్షియల్ ప్రీ–ఫైలింగ్ విధానంలో కంపెనీ దరఖాస్తు చేసింది. షేర్ల జారీ, ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఇష్యూ ఉండనుంది. కంపెనీలో టైగర్ గ్లోబల్ పెట్టుబడులు పెట్టింది. ళీ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇని్ఫనిట్ స్పేసెస్ ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 2,500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 1,200 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ళీ లగ్జరీ ఫ్యాషన్ ప్లాట్‌ఫాం పెర్నియాస్ పాప్ అప్ షాప్ మాతృ సంస్థ పర్పుల్ స్టయిల్ ల్యాబ్స్ తాజా షేర్ల జారీతో పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 660 కోట్లు సమీకరించనుంది.
→ వీడియో సరై్వలెన్స్, బయోమెట్రిక్ సొల్యూషన్స్ సంస్థ ట్రాన్స్‌లైన్ టెక్నాలజీస్ తలపెట్టిన పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు, ఒక షేర్‌హోల్డరు 1.62 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ళీ ఎల్రక్టానిక్స్ తయారీ సరీ్వసులందించే నోయిడా సంస్థ యూకేబీ ఎల్రక్టానిక్స్ తమ పబ్లిక్ ఇష్యూ కింద రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనుంది.
→ నాన్–ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ సేవల సంస్థ సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ ప్రతిపాదిత ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండనుంది. 4.28 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
→ ఓస్వాల్ కేబుల్స్ తాజా షేర్ల జారీ ద్వారా రూ. 300 కోట్లు సమీకరించనుంది. అలాగే 2.22 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను కొత్త ప్రాజెక్టు ఏర్పాటుకు, రుణాల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది. ళీ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సేవల సంస్థ బీవీజీ ఇండియా ప్రతిపాదిత ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్లకు పైగా విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రస్తుత షేర్‌హోల్డర్లు 2.85 కోట్ల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌లో విక్రయించనున్నారు.
→ కామ్‌టెల్ నెట్‌వర్క్స్ ఐపీవో ద్వారా రూ. 900 కోట్లు సమీకరించనుంది. షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్లు, ఓఎఫ్‌ఎస్ రూపంలో రూ. 750 కోట్లు సమకూర్చుకోనుంది. ఫ్రెష్ ఇష్యూ నిధులను ప్రధానంగా రుణాల చెల్లింపునకు ఉపయోగించుకోనుంది. కంపెనీ షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేయనున్నారు.


