యాపద్బాంధవులు | Most Popular womens safety apps in India | Sakshi
Sakshi News home page

యాపద్బాంధవులు

Dec 28 2025 4:16 AM | Updated on Dec 28 2025 4:16 AM

Most Popular womens safety apps in India

2025–ట్రెండింగ్‌ ఉమెన్‌ సేఫ్టీ యాప్స్‌

ఏ పుట్టలో ఏ పాము ఉందో...అన్నట్లు మహిళల భద్రతకు సంబంధించి ఎక్కడ ఏ ముప్పు పొంచి ఉంటుందో తెలియదు. ఏ ప్రయాణంలో ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో ఉమెన్‌ సేఫ్టీ యాప్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. రకరకాల మార్గాల ద్వారా మహిళలు ప్రమాదాల బారిన పడకుండా, ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. 2025 సంవత్సరం ట్రెండింగ్‌ ఉమెన్‌ సేఫ్టీ యాప్స్‌ గురించి...

మై సేఫ్టీపిన్‌
క్రౌడ్‌ సోర్స్‌ డేటాను ఉపయోగించి వివిధ ప్రాంతాలకు సంబంధించి భద్రతా స్కోర్‌లను అందిస్తుంది... మై సేఫ్టీపిన్‌ యాప్‌. సురక్షితమైన మార్గాలను సూచిస్తుంది. ఆపద సమయంలో పోలీసులు రంగంలోకి దిగేలా చేస్తుంది. షెల్టర్ల గురించి చెబుతుంది. నగరాలను నావిగేట్‌ చేయడంలో సహాయపడడానికి ‘లైవ్‌ ట్రాకింగ్‌’ను అనుమతిస్తుంది. సేఫ్టీ స్కోర్, సేఫెస్ట్‌ రూట్, క్విక్‌ అడిట్, సపోర్ట్‌ నెట్‌వర్క్, లైవ్‌ ట్రాకింగ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌లాంటి కీలకమైన ఫీచర్‌లు ‘మై సేఫ్టీపిన్‌’ యాప్‌లో ఉన్నాయి.

నూన్‌లైట్‌
నూన్‌లైట్‌ అనేది మహిళలకు సంబంధించిన పర్సనల్‌ సేఫ్టీ యాప్‌. 24/7 అత్యవసర పర్యవేక్షణను అందిస్తుంది. బటన్‌ను ప్రెస్‌ చేయడం ద్వారా మనం ఉన్న  స్థల వివరాలను పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యసిబ్బందిని పంపించి సర్టిఫైడ్‌ ఆపరేటర్‌లను మనకు కనెక్ట్‌ చేస్తుంది.
ఎలా పనిచేస్తుందంటే...  ‘సురక్షితంగా లేను’ అని భావించినప్పుడు ఆన్‌స్క్రీన్‌ బటన్‌ను నొక్కాలి. సర్టిఫైడ్‌ ఆపరేటర్లు మనకు టెక్ట్స్‌ లేదా ఫోన్‌ కాల్‌ చేస్తారు. మనం ఉన్న లొకేషన్‌కి సంబంధించిన సమాచారాన్ని సమీపంలోని 811 కేంద్రానికి పంపుతారు. అలర్ట్, లోకేషన్‌ షేరింగ్, పీస్‌ ఆఫ్‌ మైండ్‌లాంటి కీలక ఫీచర్లు ‘నూన్‌లైట్‌’లో ఉన్నాయి.

112 ఇండియా యాప్‌
మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆవిష్కరించిన యాప్‌...112 ఇండియా. ఇది కస్టమర్‌లను ఒకే నంబర్‌ (112) ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్‌ సిబ్బందికి అనుసంధానించి వారి సేవలు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. కంట్రోల్‌ రూమ్‌ లేదా సమీపంలోని వాలంటీర్‌లకు ఇబ్బందుల్లో ఉన్న మహిళ లొకేషన్‌ పంపుతుంది. తక్షణ సహాయం కోసం ఇందులో ‘షౌట్‌’ ఫీచర్‌ ఉంది. అత్యవసర సమయాలలో ‘షౌట్‌’ సమీపంలోని రిజిస్టర్డ్‌ వాలంటీర్‌లను అప్రమత్తం చేస్తుంది.

యూ ఆర్‌ సేఫ్‌
హ్యాండ్స్‌–ఫ్రీ ఎమర్జెన్సీ అలార్ట్స్‌కు ఉపయోగపడే పర్సనల్‌ సేఫ్టీ యాప్‌... యూఆర్‌సేఫ్‌. ఇందులోని కీ ఫీచర్లు... హ్యాండ్స్‌–ఫ్రీ ఎస్‌వోఎస్‌: సింగిల్‌ ట్యాప్‌ లేదా వాయిస్‌ కమాండ్‌తో అలర్ట్స్‌ను యాక్టివేట్‌ చేస్తుంది. లైవ్‌ ట్రాకింగ్‌ అండ్‌ స్ట్రీమింగ్‌: అత్యవసర సమయాల్లో మహిళ లొకేషన్‌ను ఆడియో, వీడియో స్ట్రీమింగ్‌తో సేఫ్టీ స్కాడ్‌ (మన సన్నిహిత బృందం)కి షేర్‌ చేస్తుంది.
ఫాలోమీ: ప్రయాణాలలో మన లొకేషన్‌ను లేదా ఇటీఏను మన సన్నిహితులకు షేర్‌ చేస్తుంది. సేఫ్టీచెక్స్‌: లొకేషన్‌ బేస్డ్‌ సేఫ్టీ ట్రిగ్గర్స్‌తో మన భద్రతను పర్యవేక్షిస్తుంది. క్రాష్‌ అండ్‌ ఫాల్‌ డిటెక్షన్‌: ప్రమాదాలకు గురైనప్పుడు అలర్ట్స్‌ పంపుతుంది.

విత్‌ యూ
‘ఐయామ్‌ ఇన్‌ డేంజర్‌’లాంటి మెసేజ్‌ల ద్వారా మన భద్రతకు రక్షణగా నిలిచే యాప్‌... ‘విత్‌యూ’. అవతలి వ్యక్తి స్పందించే వరకు ఈ మెసేజ్‌ పదేపదే రిపీట్‌ అవుతుంది. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా యూజర్స్‌ మూమెంట్‌ను ట్రాక్‌ చేస్తుంది. ఫోన్‌ పవర్‌ బటన్‌ను డబుల్‌ క్లిక్‌ చేయడం ద్వారా ‘విత్‌యూ’ యాక్టివేట్‌ అవుతుంది. ‘ఐయామ్‌ ఇన్‌ డేంజర్‌’ ‘ఐ నీడ్‌ హెల్ప్‌’ ‘ప్లీజ్‌ ఫాలో మై లొకేషన్‌’లాంటి మెసేజ్‌లను ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు పంపుతుంది.

షేక్‌ 2 సేఫ్టీ
మహిళా భద్రతకు సంబంధించిన ఆండ్రాయిడ్‌ యాప్‌... ‘షేక్‌ 2 సేఫ్టీ’. ఫోన్‌ను షేక్‌ చేయడం ద్వారా లేదా పవర్‌బటన్‌ను నాలుగుసార్లు నొక్కడం ద్వారా హెచ్చరికలను(ఎస్‌ఎంఎస్‌/కాల్‌) పంపుతుంది. ఆఫ్‌లైన్, లాక్‌డ్‌ స్క్రీన్‌లోనూ పనిచేస్తుంది. యాప్‌ సెట్టింగ్స్‌లో ఎమర్జెన్సీ కాంటాక్స్‌ను యాడ్‌ చేయాలి. ఎమర్జెన్సీ సమయాలలో ఎస్‌వోఎస్‌ మెసేజ్‌లకు సంబంధించి సైరన్‌ బట్‌ యాడ్‌ చేయవచ్చు.
 

సర్కిల్‌ ఆఫ్‌ 6
మహిళల భద్రతకు సంబంధించిన ‘సర్కిల్‌ ఆఫ్‌ 6’ యాప్‌ను కాలేజీ విద్యార్థులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆరుగురు నమ్మకమైన స్నేహితులతో మన భద్రతకు సంబంధించిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది సర్కిల్‌ ఆఫ్‌ 6. ఆపదలో ఉన్నప్పుడు,అత్యవసర సమయాల్లో మనం ఉన్న లొకేషన్‌ వివరాల ప్రీ-ప్రోగ్రామ్‌డ్‌ ఎస్‌ఎంఎస్‌ను మన సర్కిల్‌కు పంపిస్తుంది. హాట్‌లైన్‌కు వేగంగా యాక్సెస్‌ అయ్యేలా చేస్తుంది. సింపుల్‌ ఐకాన్స్, జీపీఎస్‌ని ఉపయోగించి ‘సర్కిల్‌’ ద్వారా మన భద్రతను పర్యవేక్షిస్తుంది. స్పీడ్‌ అండ్‌ సింప్లీసిటీతో ప్రైవసీ ప్రధానంగా, కమ్యూనిటీ ఫోకస్‌డ్‌గా రూపొందించిన ఫీచర్‌లు ఇందులో ఉన్నాయి.

వరల్డ్‌ ఎమర్జెన్సీ అసోషియేషన్‌... 
టాప్‌ 10 ఉమెన్‌ సేఫ్టీ యాప్స్‌
దిల్లీ పోలీసులు ‘హిమ్మత్‌ ప్లస్‌’ అనే ఉమెన్‌ సేఫ్టీ యాప్‌ను రూపొందించారు. ఫ్యామిలీ సేఫ్టీ కోసం రూపొందించిన పాపులర్‌ లొకేషన్‌–షేరింగ్‌ యాప్‌...లైఫ్‌360. లైవ్‌ లొకేషన్‌ షేరింగ్, ఎస్‌వోఎస్‌ అలర్ట్స్‌. ప్లేస్‌ అలార్ట్స్, రైడ్‌–షేర్‌ సేఫ్టీ, ఫ్యామిలీసేఫ్టీలాంటి కీ సేఫ్టీ ఫీచర్‌లు ఇందులో ఉన్నాయి. మహిళల భద్రతకు సంబంధించి ‘ది వరల్డ్‌ ఎమర్జెన్సీ అసోసియేషన్‌’ ప్రకటించిన టాప్‌ 10 సేఫ్టీ యాప్‌లలో...మై సేఫ్‌పిన్, నూన్‌లైట్, లైఫ్‌ 360, యూఆర్‌సేఫ్‌ యాప్‌లతో పాటు మై ఎస్‌వోఎస్‌ ఫ్యామిలీ, ఎమర్జెన్సీ యాప్‌ ఆల్ట్రా, అమెరికాలో పాపులర్‌ అయిన సిటిజన్, ఐయామ్‌ సేఫ్‌. గూగుల్‌ పర్సనల్‌ సేఫ్టీ, సేఫ్టీ యాప్‌లు ఉన్నాయి.

అక్కలాంటి... అమ్మలాంటి యాప్‌
ముంబైలోని ధారావి మహిళలకు స్వచ్ఛంద సంస్థ ‘స్నేహాస్‌ లిటిల్‌సిస్టర్‌’ వారి యాప్‌ అక్కలా, అమ్మలా ధైర్యాన్ని ఇస్తోంది. ఆపదలో, కష్టాల్లో ఉన్న మహిళలు సహాయం కోసం ఎక్కడికో వెళ్లకుండ ‘స్నేహాస్‌ లిటిల్‌ సిస్టర్‌ యాప్‌’ను ఆశ్రయిస్తున్నారు. ఈ యాప్‌ వారికి తగిన భద్రతను, భరోసాను ఇస్తుంది. ‘సే హెల్ప్‌’ అనే యాప్‌ ద్వారా ఇటీవల దిల్లీ పోలీసులు కిడ్నాప్‌కు గురైన ఆరుగురు మహిళలను రక్షించారు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘ఒకప్పుడు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయంగా ఉండేది. ఉమెన్‌ సేఫ్టీ యాప్‌ల వల్ల ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ యాప్‌లు ధైర్యాన్ని, రక్షణను ఇస్తున్నాయి’ అంటుంది చెన్నైకి చెందిన 24 సంవత్సరాల రవళి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement