భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం అంటే గుర్తుకొచ్చే పేరు అంబానీ ఫ్యామిలీ. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం, ప్రపంచ స్థాయి విలాసవంతమైన జీవనం.. ఇవన్నీ ఉన్నా మనుషులతో మమైకమయ్యే గొప్ప మనసు ఆ కుటుంబానిదని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ మరోసారి చాటారు. ఒక సాధారణ సిబ్బంది పుట్టినరోజు వేడుకలో ఆమె పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదికాస్తా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీని ఫలితంగా గూగుల్ ట్రెండ్స్‌లో నీతాఅంబానీ టాప్ స్థానంలో నిలిచారు.
వైరల్ వీడియోలో..
‘అంబానీ ఫ్యామిలీ’ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ అయిన వీడియోలని వివరాల ప్రకారం.. నీతా అంబానీ తన ఇంటి సిబ్బంది పక్కన నిలబడి తన పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా ఆమె చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా హ్యాపీ బర్త్‌డే విషెస్ చెప్పారు. కేక్ కటింగ్ పూర్తయిన వెంటనే ఆమె ఎలాంటి హడావుడి లేకుండా ఒక స్పూన్‌తో చాక్లెట్ కేక్ ముక్కను తీసి ఆ సిబ్బందికి ప్రేమగా తినిపించారు. ఈ ఊహించని చర్యతో సంతోషం పట్టలేకపోయిన సిబ్బంది చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ‘సో డౌన్ టు ఎర్త్’ క్యాప్షన్ ఉన్న ఈ వీడియో కేవలం ఒక్క రోజులోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి: వెండి మెరుపులు.. కారణాలు ఏమై ఉండొచ్చు?


