సమన్వయంతో కూడిన చర్యలు
పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ
ఆర్‌బీఐ బులెటిన్ వెల్లడి
ముంబై: సమన్వయంతో కూడిన ద్రవ్య, పరపతి– నియంత్రణ విధానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు బలంగా కొనసాగడానికి సాయపడినట్టు ఆర్‌బీఐ తాజా బులెటిన్ పేర్కొంది. అయితే వెలుపలి రిస్క్‌ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు పూర్తి రక్షణ లేకపోవడాన్ని గుర్తు చేసింది.
స్థూల ఆర్థిక మూలాలు, ఆర్థిక సంస్కరణలపై ప్రత్యేక దృష్టి కొనసాగించడం సామర్థ్యాలు, ఉత్పాదకత పెంపునకు సాయం చేస్తుందని.. వేగంగా మారిపోతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడేందుకు దారితీస్తుందని పేర్కొంది. 2025లో అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో టారిఫ్‌లతో నెలకొన్న అసాధారణ మార్పును ప్రస్తావించింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంపై ఈ ప్రభావం ఎంతమేర ఉంటుందన్న దానిపై స్పష్టత లేదంటూ.. అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపై మాత్రం ప్రభావం ఉంటుందని పేర్కొంది.
పటిష్టంగా దేశీ డిమాండ్
దేశీయంగా బలమైన డిమాండ్ మద్దతుతో 2025–26లో క్యూ2లో (సెపె్టంబర్ త్రైమాసికం) భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని నమోదు చేసినట్టు ఆర్‌బీఐ బులెటిన్ తెలిపింది. నవంబర్ నెలకు సంబంధించి కీలక సంకేతాలు సైతం డిమాండ్ బలంగా ఉండడాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ కనిష్ట స్థాయిలోనే కొనసాగుతుండడాన్ని గుర్తు చేసింది.
2025 ఏప్రిల్–అక్టోబర్ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) గతేడాది ఇదే కాలంతో పోలి్చతే అధికంగా ఉన్నట్టు తెలిపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మాత్రం ప్రతికూలంగా ఉన్నట్టు తెలిపింది. భారత్–యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశి్చతులు, అధిక వ్యాల్యూషన్ల వద్ద ఎఫ్‌పీఐల అమ్మకాలు చేస్తున్నట్టు పేర్కొంది. ఇది రూపాయి విలువను సైతం ప్రభావితం చేస్తున్నట్టు తెలిపింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ అక్టోబర్‌లో 11.87 బిలియన్ డాలర్లు వెచి్చంచినట్టు వెల్లడించింది.


