ఆదాయపు పన్ను చట్టంతో కొత్త మార్పులు! | Income Tax Rules 2026 Major Tax Forms Renumbered Under New Income Tax Act 2025 Full List Explained | Sakshi
Sakshi News home page

Income Tax Rules 2026: ఆదాయపు పన్ను చట్టంతో కొత్త మార్పులు!

Feb 9 2026 6:33 PM | Updated on Feb 9 2026 7:11 PM

Income Tax Rules 2026 Major Tax Forms Renumbered Under New Income Tax Act 2025 Full List Explained

కేంద్ర ప్రభుత్వం.. ఆదాయ పన్ను చట్టం 2025ను.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో డ్రాఫ్ట్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఫారమ్స్ విడుదల చేసింది. ఇందులో అనేక కొత్త నిబంధనలను ప్రతిపాదించారు.

కొత్త నిబంధనలలో ప్రతిపాదించిన అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఆదాయపు పన్ను ఫారమ్‌లకు కొత్త సంఖ్యలు ఇవ్వడం. పాత ఇన్‌క‌మ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఉపయోగించిన అనేక ఫారమ్‌లకు.. ఇప్పుడు కొత్త సంఖ్యలు కేటాయిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, గందరగోళాన్ని తగ్గించడం, కొత్త చట్టానికి అనుగుణంగా ఒకే విధమైన నిర్మాణం తీసుకురావడం.

కొత్త మార్పులు
➤టాక్స్ ఆడిట్‌కు సంబంధించిన పాత ఫారమ్‌లు 3CA, 3CB, 3CD ఇకపై విడివిడిగా ఉండవు. వీటన్నింటిని కలిపి ఫారమ్ 26గా మార్చారు.
➤ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ ఆడిట్‌కు ఉపయోగించే ఫారమ్ 3CEB ఇప్పుడు ఫారమ్ 48గా మారుతుంది.
➤ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC) కోసం ఉపయోగించే ఫారమ్ 10FAను ఫారమ్ 42గా మార్చారు.
➤ఎమ్ఏటీ సర్టిఫికేషన్ కోసం ఉన్న ఫారమ్ 29B ఇప్పుడు ఫారమ్ 66 అవుతుంది.
➤డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) సంబంధిత సమాచారానికి ఉపయోగించే ఫారమ్ 10F ఇకపై ఫారమ్ 41గా ఉంటుంది.

TDS & TCSకు సంబంధించిన మార్పులు
➤TCS రిటర్న్ కోసం ఉన్న ఫారమ్ 27EQ ఇప్పుడు ఫారమ్ 143 అవుతుంది.
➤తక్కువ లేదా నిల్ TDS సర్టిఫికేట్ కోసం ఉపయోగించే ఫారమ్ 13ను ఫారమ్ 128గా మార్చారు.
➤నాన్-రెసిడెంట్లకు సంబంధించిన TDS రిటర్న్ (ఫారమ్ 27Q) ఇప్పుడు ఫారమ్ 144గా మారుతుంది.
➤జీతభత్యాలపై TDS రిటర్న్ అయిన ఫారమ్ 24Q ఇకపై ఫారమ్ 138 అవుతుంది.
➤ఉద్యోగులకు ఇచ్చే శాలరీ టీడీఎస్ సర్టిఫికెట్ (ఫారమ్ 16) ఇప్పుడు ఫారమ్ 130గా మారుతుంది.
➤రెసిడెంట్లకు సంబంధించిన టీడీఎస్ రిటర్న్ (ఫారమ్ 26Q)ను ఫారమ్ 140గా మారుతుంది.

చారిటబుల్ ట్రస్టులు & NGOలకు ఫారమ్ మార్పులు
➤తాత్కాలిక నమోదు కోసం ఇప్పటివరకు ఉపయోగించిన ఫారమ్ 10Aను ఇప్పుడు ఫారమ్ 104గా మార్చారు.
➤తుది నమోదు లేదా రెన్యువల్ కోసం ఉన్న ఫారమ్ 10AB.. ఇకపై ఫారమ్ 105 అవుతుంది.
➤ఆదాయం నిల్వ కోసం ఉన్న ఫారమ్ 10ను ఫారమ్ 109గా మార్చారు.
➤ఆడిట్ రిపోర్టుల కోసం ఉపయోగించే ఫారమ్ 10B, 10BB స్థానంలో ఇప్పుడు ఒకే ఫారమ్ 112 ఉంటుంది.
➤డోనీ స్టేట్‌మెంట్ కోసం ఉన్న ఫారమ్ 10BD ఇప్పుడు ఫారమ్ 113గా మారుతుంది.
➤డోనర్ సర్టిఫికేట్ కోసం ఉన్న ఫారమ్ 10BEను.. ఫారమ్ 114గా మార్చారు.

ఇతర ముఖ్యమైన ఫారమ్ మార్పులు
➤విదేశీ రిమిటెన్సుల కోసం సీఏ సర్టిఫికేట్ అయిన ఫారమ్ 15CB ఇప్పుడు ఫారమ్ 146 అవుతుంది.
➤యాన్యువల్ ట్యాక్స్ స్టేట్‌మెంట్‌గా ఉపయోగించే ఫారమ్ 26AS ఇకపై ఫారమ్ 168గా మారుతుంది.
➤ఆర్థిక లావాదేవీల వివరాల కోసం ఉన్న స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ ఫారమ్ 61Aను ఫారమ్ 165గా మార్చారు.
➤విదేశీ రిమిటెన్స్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఫారమ్ 15CA ఇప్పుడు ఫారమ్ 145గా ఉంటుంది.

ఈ మార్పుల వల్ల పన్ను వ్యవస్థ మరింత సరళంగా ఉంటుందని.. డిజిటల్‌కు అనుకూలంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపార సంస్థలు ఈ కొత్త ఫారమ్ సంఖ్యలను ముందుగానే అవగాహన చేసుకుని, 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త చట్టానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం.

ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement