మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త స్కీములు | New Mutual Fund Schemes Launched Kotak 360 ONE DSP Fresh Investment Options | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త స్కీములు

Feb 9 2026 5:32 PM | Updated on Feb 9 2026 5:57 PM

New Mutual Fund Schemes Launched Kotak 360 ONE DSP Fresh Investment Options

ముంబై: కోటక్‌ మహింద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ.. కోటక్‌ సర్వీసెస్‌ ఫండ్‌ పేరుతో కొత్త పథకాన్ని (ఎన్‌ఎఫ్‌వో) ప్రారంభించింది. ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. దేశ జీడీపీలో 55 శాతం వాటా ఆక్రమిస్తూ, వృద్ధికి కీలక చోదకంగా ఉన్న సేవల రంగంలో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుందని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రకటించింది.

వినియోగ సేవలు, టెలికం, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, ఐటీ, విద్యుత్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ తదితర రంగాలతో కూడిన సేవలు దీర్ఘకాల పెట్టుబడులకు మంచి వృద్ధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొంది. మంచి వృద్ధి అవకాశాలు, సహేతుక ధరల వద్దనున్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపారం, యాజమాన్యం, కంపెనీ విలువకు ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రకాల మార్కెట్‌ విలువల్లోనూ పెట్టుబడులు పెడుతుంది.

నాణ్యమైన వ్యాపారం, బలమైన నగదు ప్రవాహాలను చూస్తుంది. కనీసం రూ.1,000, అంతకుమించి ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌వో ముగిసిన కొన్ని రోజుల అనంతరం తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో, దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధిని కోరుకునే వారికి ఈ పథకం అనుకూలమని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది.

360 వన్‌ ఎంఎఫ్‌ నుంచి సిఫ్‌ పథకం 
సంపన్న ఇన్వెస్టర్ల కోసం 360 వన్‌ మ్యుచువల్‌ ఫండ్‌ తాజాగా డైనాసిఫ్‌ ఈక్విటీ లాంగ్‌–షార్ట్‌ ఫండ్‌ పేరిట స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (సిఫ్‌)ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 20న ముగుస్తుంది. ఇది కనీసం 80 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్‌కి కేటాయిస్తుంది. ఈక్విటీ డెరివేటివ్స్‌ ద్వారా 25 శాతం వరకు షార్ట్‌ ఎక్స్‌పోజర్‌ తీసుకునేందుకు, డెట్‌ అలాగే ఇని్వట్స్‌లో 20 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఉంటుంది.

దీనికి బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 10 లక్షలు (అక్రెడిటెడ్‌ ఇన్వెస్టర్లయితే రూ. 1,00,000) ఇన్వెస్ట్‌ చేయొచ్చు. మ్యుచువల్‌ ఫండ్స్‌ పరమైన ట్యాక్సేషన్‌ ప్రయోజనాలతో పాటు మరింత మెరుగైన రాబడులను అందించే విధంగా ఈ ఫండ్‌ ఉంటుందని 360 వన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో రాఘవ్‌ అయ్యంగార్‌ తెలిపారు.  

డీఎస్‌పీ మల్టీ అసెట్‌ ఆమ్ని ఎఫ్‌వోఎఫ్‌ 
ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియను సరళతరం చేసే దిశగా డీఎస్‌పీ మ్యుచువల్‌ ఫండ్‌ సంస్థ మల్టీ అసెట్‌ ఆమ్ని ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 19 వరకు అందుబాటులో ఉంటుంది. సంస్థకు చెందిన స్వంత మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ డీఎస్‌పీ నేత్ర దన్నుతో ఇది పని చేస్తుంది. ఈక్విటీ, డెట్‌ ఆధారిత స్కీములు, గోల్డ్‌..సిల్వర్‌ ఈటీఎఫ్‌ల్లాంటి కమోడిటీ ఆధారిత స్కీములు మొదలైన వాటిలో ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది.

మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఈక్విటీ ఆధారిత స్కీముల్లో 25–75 శాతం, డెట్‌ స్కీముల్లో 15–50 శాతం, గోల్డ్‌–సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో 10–50 శాతం మేర ఇది పెట్టుబడులు పెట్టొచ్చు.  మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు ఈక్విటీల్లో పెట్టుబడులను కనిష్టంగా 25 శాతానికి కూడా తగ్గించే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడులను వివిధ సాధనాల్లో డైవర్సిఫై చేయడం వల్ల రాబడుల కోసం కేవలం ఒకే సాధనంపై ఆధారపడాల్సిన రిసు్కలు తగ్గుతాయని సంస్థ ప్రోడక్ట్‌ హెడ్‌ సాహిల్‌ కపూర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement