న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటించింది. టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో (టీఈఆర్)కు మరింత మెరుగైన నిర్వచనం ఇస్తూ, బ్రోకరేజీ సంస్థలు ఫండ్స్ నుంచి వసూలు చేసే చార్జీలను గణనీయంగా తగ్గిస్తూ సెబీ కొత్త ప్రతిపాదనలను సిద్దం చేయడం తెలిసిందే.
అక్టోబర్ 28న వీటిని విడుదల చేస్తూ, ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. తమకు అందించిన వినతుల మేరకు అభిప్రాయాలు తెలియజేసే గడువును 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటన విడుదల చేసింది.


