మిగిలిన దేశాలతో సోలార్ అలయన్స్
న్యూఢిల్లీ: అమెరికా వైదొలిగినప్పటికీ, మిగిలిన 125 దేశాలతో కలసి భారత్ అంతర్జాతీయ సోలార్ కూటమిని ముందుకు నడిపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ఐఎస్‌ఏ) అన్నది భారత్, ఫ్రాన్స్ సంయుక్త సహకారంతో ఏర్పడిన కూటమి. సౌర ఇంధన పరిష్కారాలతో వాతావరణ మార్పులపై పోరాటం కోసం ఏర్పాటైన సంస్థ. 2015లో పారిస్‌లో కాప్21 సదస్సు సందర్భంగా దీనికి బీజం పడింది.
ఐక్యరాజ్యసమితిలోని అన్ని దేశాలూ ఇందులో చేరేందుకు అనుమతి ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ సహా 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. వీటిల్లో భాగస్వామ్యం అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొనడం గమనార్హం. ఐఎస్‌ఏ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు వచి్చన మీడియా నివేదికలు ప్రభుత్వం దృష్టికి వచి్చనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
మిగిలిన దేశాలతో కూటమి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశాయి. సౌర విద్యుత్ అభివృద్ధి, నిధుల సమీకరణ, సామర్థ్యం ఏర్పాటుపై కృషి కొనసాగుతుందని చెప్పాయి. భారత్ అధ్యక్షత వహిస్తున్న ఐఎస్‌ఏలో ఇప్పుడు 125 సభ్య దేశాలుగా ఉన్నాయి. సోలార్ ఇంధన సామర్థ్యం విస్తరణలో సభ్య దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ కూటమి దృష్టి సారిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఐఎస్‌ఏ ఏర్పాటైన నాటి నుంచి సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే విషయంలో ఎంతో కృషి జరగడం గమనార్హం.


