ఒలెక్ట్రాకు 1,085 బస్సుల భారీ ఆర్డరు | Telangana Orders 1,085 Olectra e-Buses Under PM E‑Drive To Boost Hyderabad Public Transport, Details Inside | Sakshi
Sakshi News home page

ఒలెక్ట్రాకు 1,085 బస్సుల భారీ ఆర్డరు

Feb 24 2026 12:49 AM | Updated on Feb 24 2026 11:30 AM

Telangana orders 1,085 Olectra e-buses says TGSRTC

టీజీఎస్‌ఆర్‌టీసీ నుంచి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పీఎం ఈ–డ్రైవ్‌ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌ (టీజీఎస్‌ఆర్‌టీసీ) నుంచి 1,085 ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్డరు వచి్చనట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ వెల్లడించింది. దీనికి సంబంధించి తమ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్‌ ద్వారఫ్లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ లభించినట్లు వివరించింది. ఎలక్ట్రిక్‌ బస్సులను హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ కోసం వినియోగించనున్నట్లు సంస్థ ఎండీ మహేష్‌బాబు తెలిపారు. 

ఇక్కడి రహదారులకు అనుగుణంగా ఏసీ, నాన్‌ ఏసీ వేరియంట్లలో 12 మీటర్ల లో–ఫ్లోర్‌ కాని్ఫగరేషన్స్‌తో ఈ బస్సులను అందించనున్నట్లు వివరించారు. ఒకసారి చార్జ్‌ చేస్తే 250 కి.మీ. మైలేజీనిచ్చే విధంగా ఇవి ఉంటాయని, సుమారు 45 నిమిషాల్లో చార్జింగ్‌ చేసేందుకు వీలుంటుందని మహేష్‌బాబు తెలిపారు. ఇప్పటికే కంపెనీకి చెందిన 3,600 ఎలక్ట్రిక్‌ బస్సులు దేశవ్యాప్తంగా రహదారులపై తిరుగుతుండగా, 10,000 పైగా వాహనాలకు ఆర్డర్లు ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement