TG: మెట్రోపై కీలక నిర్ణయం.. ఇకపై ప్రభుత్వ పరం | Telangana Medical Policy Council name change | Sakshi
Sakshi News home page

TG: మెట్రోపై కీలక నిర్ణయం.. ఇకపై ప్రభుత్వ పరం

Feb 23 2026 7:42 PM | Updated on Feb 23 2026 9:30 PM

Telangana Medical Policy Council name change

సాక్షి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  హైదరాబాద్ ఎల్‌ అండ్‌ టీ మెట్రోను పూర్తిస్థాయిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు తెలంగాణ వైద్య విధాన పరిష‍త్ పేరు మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్‌ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చింది. 

అదే విధంగా ఇకపై టీవీవీపీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రానున్నట్లు తెలిపింది.  ఈ రోజు  కేబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబీనెట్ సమావేశమయ్యింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించదలచిన జనగణనపై కేబీనెట్ భేటీలో కీలక చర్చ జరిపారు. రాష్ట్రంలో జనగణనను అ‍త్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు 89వేల సిబ్బంది పని చేయననున్నట్లు తెలిపారు. ప్రజల వివరాల కోసం  34 ప్రశ్నలతో కేంద్రం రూపొందించిన సమగ్ర సర్వే పత్రాన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

మే 11న ఇండ్ల గణన ప్రక్రియను ప్రారంభించి జూన్ 9 వతేదీ వరకూ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అయితే తొలిదశ జనగణన పూర్తైన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండోదశ జనగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement