టీడీఆర్‌పై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం | Key Decision On TDR In Telangana Govt | Sakshi
Sakshi News home page

టీడీఆర్‌పై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

Aug 14 2026 2:49 PM | Updated on Aug 14 2026 3:00 PM

Key Decision On TDR In Telangana Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీడీఆర్‌ (Transferable Development Rights)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్‌ సర్టిఫికెట్ల జారీ బాధ్యత హెచ్‌ఎండీకే అప్పగించిన ప్రభుత్వం.. హెచ్‌ఎండీఏ పరిధిలోని క్యూర్‌, ఫ్యూర్‌ ప్రాంతాల్లో వర్తిస్తుందని స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోనూ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. 

ప్రజా ప్రయోజన ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారికి టీడీఆర్‌ సర్టిఫికెట్లను ప్రభుత్వం ఇవ్వనుంది. హెచ్‌ఎండీఏ జారీ చేసే టీడీఆర్‌ను హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగం, డిస్పోజల్‌కు అవకాశం ఉంది. టీడీఆర్‌ సర్టిఫికెట్ల ప్రాసెసింగ్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. బిల్డ్ నౌ వ్యవస్థలో అవసరమైన మార్పులను ప్రభుత్వం చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement