మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | Telangana Assembly Budget Session From March 16th | Sakshi
Sakshi News home page

మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Feb 23 2026 9:13 PM | Updated on Feb 23 2026 9:33 PM

Telangana Assembly Budget Session From March 16th

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 16 వ తేదీ నుంచి 30 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరపాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

తొలుత ఈ నెల 26వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా.. ఆ తేదీని కాస్త వెనక్కు జరిపింది తెలంగాణ ప్రభుత్వం.  రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించి తుది మెరుగులు దిద్దే క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల తేదీని కాస్త వెనక్కు జరపాల్సి వచ్చినట్లు సమాచారం. ఆర్థికశాఖ మల్లు భట్టి విక్రమార్క. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మార్చి 20వ తేదీన అసెంబ్లీ ప్రవేశపెడతారు.  గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement