Hyd: హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి భారీ డిమాండ్ | Hyderabad Housing Board Plots Witness Huge Demand Again | Sakshi
Sakshi News home page

Hyd: హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి భారీ డిమాండ్

Feb 23 2026 6:56 PM | Updated on Feb 23 2026 7:19 PM

Hyderabad Housing Board Plots Witness Huge Demand Again

హైదరాబాద్‌:  నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హౌసింగ్ బోర్డు స్థలాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.  తాజాగా జరిగిన వేలంపాటల్లో ఈ స్థలాలకు ఊహించని స్థాయిలో పోటీ కనిపించింది. గచ్చిబౌలిలో 263 గజాల ఫ్లాట్‌కు రికార్డు ధర పలికింది.  ఈ ప్లాట్‌కు సంబంధించి చదరపు గజం రూ.1.76 లక్షల ధర పలికింది. 

ఇక కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో చదరపు గజం రూ.1.64 లక్షల ధరకు అమ్ముడుపోయింది. చింతల్‌లో గజానికి రూ.84 వేలు, రూ.74 వేలు ధర పలకగా, నిజాంపేట సిద్ధి ఫ్లాట్ రూ.17.70 లక్షలకు విక్రయించారు. బౌరంపేట 2600 గజాల భూమి గజానికి రూ.61 వేల అమ్ముడుపోగా, ఎంఐజి, హెఐజి ప్లాట్లకు కొనుగోలుదారుల పోటీ నెలకొంది. 

ఇలా బహిరంగ వేలం ద్వారా రూ. 34. 27 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 14 భూములను వేలం ద్వారా విక్రయించగా, వాటికి రికార్డు ధరలు పలికాయి. ఈ వేలాన్ని కెపిహెచ్‌బి కమ్యూనిటీ హాల్‌లో  నిర్వహించారు. ఇందులో సుమారు 50 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement