రూ.10,000 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌!  | ED attaches Rs 10,021.46 crore in PACL money laundering case | Sakshi
Sakshi News home page

రూ.10,000 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌! 

Feb 19 2026 6:22 AM | Updated on Feb 19 2026 6:22 AM

 ED attaches Rs 10,021.46 crore in PACL money laundering case

ఉత్తర్వు జారీ చేసిన ఈడీ  

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో రూ.10,000 కోట్ల విలువైన 247 చరాస్తుల అటాచ్‌మెంట్‌కు ఉత్తర్వు జారీ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బుధవారం వెల్లడించింది. ఇప్పటిదాకా ఇదే అతిపెద్ద సింగిల్‌ అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ అని తెలియజేసింది. చండీగఢ్‌కు చెందిన పీఏసీఎల్‌ లిమిటెడ్‌ (రత్నాల వ్యాపారం చేసే గ్రూప్‌) అనే సంస్థ పెట్టుబడుల పథకం ముసుగులో దేశవ్యాప్తంగా లక్షలాది మంది నుంచి రూ.48,000 కోట్లు సేకరించి, తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఇందులో మనీ లాండరింగ్‌ కూడా జరిగినట్లు తేలింది. దీనిపై ఈడీ విచారణ చేపట్టింది. 

మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద పంజాబ్‌లోని మొహాలీ, రూప్‌నగర్, జిరాక్‌పూర్‌లో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఉత్తర్వు జారీ చేసింది. మొత్తం 247 చరాస్తుల విలువ రూ.10,021.46 కోట్లు ఉంటుందని ఈడీ వెల్లడించింది. పీఏసీఎల్‌ లిమిటెడ్‌పై తొలుత 2014 ఫిబ్రవరిలో సీబీఐ విచారణ ప్రారంభించింది. తర్వాత ఈడీ రంగ ప్రవేశం చేసింది. 2016లో కేసు నమోదు చేసింది. ఇప్పటిదాకా కోర్టులో నాలుగు చార్జిïÙట్లు దాఖలు చేసింది. గతంలో రూ.7,610 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్‌ చేసింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement